బొబ్బిలిలో స్వైన్‌ఫ్లూ కలకలం!

27 Oct, 2018 07:47 IST|Sakshi
కాలువల్లో మురుగు తొలగించడం లేదంటూ చూపిస్తున్న సీఐటీయూ నాయకుడు పొట్నూరు

విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ

బొబ్బిలిలో అపారిశుద్ధ్యమే కారణమని స్థానికుల ఆరోపణ

విజయనగరం, బొబ్బిలి: జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్‌ అవార్డులు, పాలిథిన్‌ కవర్ల నిషేధం, వాటర్‌ ప్యాకెట్ల అమ్మకాల నిషేధం వంటి అంశాల్లో ఎన్నో అవార్డులు సాధించిన బొబ్బిలిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఇటీవలే డెంగీ వ్యాధి సోకి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో మహిళకు ప్రమాదకర స్వైన్‌ఫ్లూ సోకడంతో పట్టణవా సుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలోని పారిశుద్ధ్యం ఏస్థాయిలో ఉందో ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆరో వార్డు అగురువీధిలో నివాసముంటున్న ఓ మహిళ(38) గత పదిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సనిమిత్తం చేర్పించినాఎప్పటికీ తగ్గకపోవడం... రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ గణనీయంగా తగ్గిపోవడంతో చికిత్స చేస్తున్న వైద్యుడు జి.శశిభూషణ రావు సూచన మేరకు విశాఖలోని గురుద్వార సమీపంలో ఉన్న వెంకటేశ్వర మెడికల్స్‌లో చేర్చారు. అక్కడి డాక్టర్లు పరీక్షిం చి ఆమెకు స్వైన్‌ ఫ్లూ అనుమానంతో టీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉందని నిర్థారించారు.

పేదకుటుంబానికి పెద్ద దెబ్బ
బాధిత కుటుంబం అసలే పేదరికంలో ఉంది. ఆమె భర్త టైలర్‌ వృత్తితో కుటుం బాన్ని పోషిం చుకుంటున్నారు.అయినా నానా అవస్థలు పడు తూ ప్రస్తుతం చికిత్స చేయిస్తున్నా రు. వారు ని వాసం ఉంటున్న బొబ్బిలి వీధిలో కాలువలు ముగుతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా వాటికి సమాంతరంగా కా లు వలు నిర్మించకుండా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీని వల్ల కాలువల్లో పురుగులు, దోమలు పెరిగి వ్యాధులకు కారణాలవుతున్నాయని స్థానికులుఆవేదన చెందుతున్నారు.

అపారిశుద్ధ్యమే అసలు సమస్య
స్వైన్‌ఫ్లూ సోకిన మహిళ ఇంటివద్ద ఘోరమైన దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ వ్యాధులన్నీ సోకుతున్నాయని, నిరుపేదలు వేలల్లో ఖర్చు చేసుకుని వైద్య చికిత్సలు ఎలా పొందగలరని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో మార్లు మున్సిపల్‌ కమిషర్‌ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. అవార్డులను అందుకునేందుకు ముందుకు వెళ్లే మున్సిపల్‌ యంత్రాంగం ప్ర జల బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఫాగింగ్‌ కానీ, కాలువల్లో మురుగు తొలగింపు కానీ చేపట్టడం లేదన్నారు. విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో మన జిల్లాకు చెందిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని శంకరరావు తెలిపా రు. జిల్లాలో ఇప్పటివరకూ ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకిందని దీనిపై ప్రభుత్వం వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు