దప్పిక తీర్చుకునేందుకు వచ్చి...

8 Apr, 2014 04:42 IST|Sakshi
దప్పిక తీర్చుకునేందుకు వచ్చి...

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కౌండిన్యా అభయారణ్యంలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన గున్నఏనుగు నీటి దొనలో పడిపోయింది. ఒకరోజు రాత్రంతా అక్కడే ఉన్న దాన్ని అటవీసిబ్బంది మరుసటి రోజు ఉదయం దాదాపు మూడు గంటలసేపు శ్రమించి వెలికితీశారు. ఆదివారం రాత్రి నీళ్లు తాగడానికి అభయూరణ్యంలో కాలువపల్లె బీట్‌లోని నిచ్చెనదొన వద్దకు గున్నఏనుగు వచ్చింది.
నీళ్ల కోసం వంగి ఎనిమిది అడుగుల లోతువున్న దొనలోకి పడిపోరుుంది.

సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు వచ్చి అక్కడే ఉన్న ఏనుగుల గుంపును టపాసులు పేలుస్తూ కొంతదూరం వెళ్లగొట్టారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి తాళ్ల సాయంతో దొనలో నుంచి ఏడాది వయసున్న ఆ మగ గున్నఏనుగును  బయటకు తీశారు. అడవిలోకి వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాత్రంతా ఆహారం లేక నీరసించిన అది ముందుకు కదలేకపోయింది. సోమవారం బాగా పొద్దుపోయేవరకు కూడా ఏనుగుల గుంపు మాత్రం ఘీంకారాలు చేస్తూ అక్కడికి దగ్గరలోనే మకాం వేశాయి.      - న్యూస్‌లైన్, పలమనేరు
 

మరిన్ని వార్తలు