విశాఖ నుంచి పోటీ చేద్దామనుకున్నా: టీఎస్‌ఆర్

7 Feb, 2014 22:00 IST|Sakshi
విశాఖ నుంచి పోటీ చేద్దామనుకున్నా: టీఎస్‌ఆర్

హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేయాలనుకున్నానని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు టి. సుబ్బిరామి రెడ్డి తెలిపారు. అధిష్టానం ఆదేశానుసారం రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. హైకమాండ్ తనను రాజ్యసభకు వెళ్లమందని తెలిపారు. దీంతో చివరి నిమిషంలో రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ బిల్లుపై ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని చెప్పారు.

తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేస్తానని టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కె. కేశవరావు హామీయిచ్చారు. రాజ్యసభ్యుడిగా ఎన్నికైన తర్వాత గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు