తాడిపత్రిలో ఖాళీ దిశగా టీడీపీ?

25 Jun, 2019 09:09 IST|Sakshi

సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : తాడిపత్రి టీడీపీలో ముసలం పుట్టింది.  టీడీపీలో ఏకపక్ష నిర్ణయాలు, ఆధిపత్యాన్ని సహించలేక పోతున్న మున్సిపల్‌ కౌన్సిలర్లు ..ఒక్కొక్కరుగా ఆ పార్టీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు తమ పదవులతో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. తాజాగా సోమవారం మరో ఇద్దరు కౌన్సిలర్లు అదే బాటలో నడిచారు.

తాడిపత్రి పురపాలక సంఘంలోని 15వ, 17వ వార్డు కౌన్సిలర్లు కొండా ప్రవీణ, కొండా శిరీష.. తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీ తీర్థంపుచ్చుకున్నారు.  దాదాపు వంద కుటుంబాలు కూడా అదే బాట పట్టాయి.    వీరిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సాదరంగా ఆహ్వానించి, పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో, తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ద్వారానే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ  అందుతాయనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు