రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం

12 Sep, 2019 12:30 IST|Sakshi
రమణమ్మ పిల్లలు

సౌదీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రమణమ్మ

బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడిన తహసీల్దార్‌    

నెల్లూరు  ,మర్రిపాడు: సౌదీలోని రియాద్‌లో మృతిచెందిన మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన గుండబోయిన రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు తెలిపారు. మర్రిపాడు తహసీల్దార్‌ డీవీ సుధాకర్‌ బుధవారం సిబ్బందితో కలిసి చాబోలుకు చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన వారితో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ రమణమ్మ రెండున్నర సంవత్సరాల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడి యజమానే ఆమెను హత్య చేసినట్లుగా కుటుంబసభ్యులు చెప్పారని వెల్లడించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ సురేంద్ర, వీఆర్వో రమణయ్య ఉన్నారు.  
పాపం పిల్లలు
రమణమ్మ మృతితో ఆమె ఇద్దరు కుమారులు, కుమార్తె తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతురాలి భర్త ఐదేళ్ల క్రితం డెంగీతో మృతిచెందాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో బతుకుదెరువు కోసం రమణమ్మ సౌదీకి వెళ్లింది. కష్టపడి డబ్బు సంపాదించి పిల్లలను బాగా చుసుకోవాలనుకున్న ఆమె కలలు నెరవేరకుండానే చనిపోయింది. చిన్నారులను ఎలా చూసుకోవాలో అంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మండలానికో జూనియర్‌ కాలేజీ

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

అప్పుడు కిలిమంజారో... ఇప్పుడు ఎల్‌బ్రూస్‌

రౌడీని స్పీకర్‌ను చేసిన ఘనత చంద్రబాబుది

'బెడ్డు'మీదపల్లె

తర'గతి' మారనుంది

హాస్టల్‌ విద్యార్థులకు తీపి కబురు

‘మోడల్‌’కు మహర్దశ

అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా

వాహనదారులు అప్రమత్తం

పరారీలో ఏ1 నిందితుడు మాజీమంత్రి సోమిరెడ్డి

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

లేచింది మహిళాలోకం..

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

సిగ్నల్‌ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!

నోరు పారేసుకుంటున్న టీడీపీ నేతలు

తొలగనున్న ‘భూ’చోళ్ల ముసుగు

మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా

టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు

టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి, ప్రజా సంఘాలు!

హలో గుడ్‌ మార్నింగ్.. నేను మీ ఎమ్మెల్యే

అనంతపురంలో ప్రత్యక్షమైన గిల్‌క్రిస్ట్

ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు..

పాస్‌బుక్‌ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!

కదిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంటకు షాక్‌!

పడిపోయిన టమాట ధర!

వైఎస్సార్‌ రైతు భరోసా అర్హులకే అందాలి

పల్నాడు ప్రజల మనోభావాలకు గాయం చేయొద్దు

పల్నాడులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..