సాక్షి మైత్రి ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ

9 Mar, 2016 02:48 IST|Sakshi
సాక్షి మైత్రి ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ

గుంటూరు : సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బుధవారం నుంచి వచ్చే నెల 9 వరకు చిలకలూరిపేటలోని న్యూ ఏంజెల్స్ బ్యూటీ క్లినిక్ ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది.  మంగళవారం  వరకు అభ్యర్థుల నుంచి శిక్షణకు రిజిస్ట్రేషన్‌‌స స్వీకరిస్తారు.
 
శిక్షణలో నేర్పించే అంశాలు : బేబి ఫ్యాబ్రిక్, అంబ్రెల్లా ఫ్రాక్స్, శారీ పెట్టీకోట్, డ్రెస్ పెట్టీకోట్, ప్లెయిన్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్, సింగిల్ కటోరి బ్లౌజ్, స్మాకింగ్ ప్యాచ్ బ్లౌజ్, కాలర్ బ్లౌజ్, ప్యాటర్‌‌న బ్లౌజ్, నెక్ డిజైన్‌‌స, స్లీవ్ డిజైన్‌‌స, కుర్తీ, సల్వార్, సెమి పటియాల, చుడిదార్, కలీస్ డ్రెస్, లాంగ్ టాప్, మెథడ్ ఆఫ్ కటింగ్, మెథడ్ ఆఫ్ స్టిచింగ్ చేర్పిస్తారు. వివరాలకు ఫోన్ నెంబరు 9666372301లో సంప్రదించాలి. శిక్షణకు వచ్చే వారు తమ వెంట పెద్ద స్కేల్, టేప్, కత్తెర, మార్కర్, దారం రీలు, సూదులు, క్లాత్, (2మీ), న్యూస్ పేపర్సు, నోట్‌బుక్స్ పెన్ వెంట తెచ్చుకోవాలి. శిక్షణలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు అందజేస్తారు.

మరిన్ని వార్తలు