రొయ్యల చెరువులపై చర్యలు చేపట్టాలి

4 Mar, 2019 16:33 IST|Sakshi
పెనుమంట్ర మండలం పొలమూరు శివారు చెన్నాడచెరువులో రొయ్యల చెరువుల నుంచి వదిలిన మురుగు నీటితో ముంపునకు గురైన ఎస్సీకాలనీ ప్రాంతం 

సాక్షి, పోడూరు: పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ శివారు చెన్నాడచెరువు ఎస్సీకాలనీ సమీపంలో రొయ్యల చెరువుల నుంచి వదిలిన మురుగునీటితో కాలనీ ప్రాంతం ముంపునకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నాడచెరువు ఎస్సీ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ సమీపంలో అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు.

ఆ చెరువుల నుంచి వదిలే మురుగు నీటితో తమ ప్రాంతం నీట మునిగి నరకయాతన పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో కూడిన మురుగునీటి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఈ దుస్థితిపై తాము అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయిలో అధికారులు స్పందించి రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పూర్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు కొన్ని ఖాళీగా ఉన్నాయనీ, వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు