ప్రాణం తీస్తున్న నోట్ల మార్పిడి

12 Dec, 2016 13:51 IST|Sakshi
ప్రాణం తీస్తున్న నోట్ల మార్పిడి

- గుండెపోటుతో ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ మృతి
- క్యూలో నిల్చోలేక తనువు చాలించిన వృద్ధుడు
 
 నెల్లూరు(సెంట్రల్)/చాపాడు/తుమకూరు (కర్ణాటక): పెద్ద నోట్ల మార్పిడి వ్యవహా రం వృద్దులు, బ్యాంకు సిబ్బంది చావుకొచ్చింది. గంటల తరబడి క్యూలో నిల్చోలేక వృద్దులు ప్రాణాలు కోల్పోతుంటే మహిళలు అస్వస్థతకు గురవుతున్నారు. మరో వైపు పని భారం పెరగడంతో బ్యాంకు అధికారులు, సిబ్బంది తల్లడిల్లిపో తున్నారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎస్‌బీఐ డిప్యుటీ మేనేజర్, కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా చేళూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎం)లో ఓ వృద్దుడు గుండెపోటుతో మృతి చెందారు. వైఎస్సా ర్ జిల్లా చాపాడులో ఓ మహిళ సొమ్మసిల్లి కిందపడి పళ్లూడగొట్టుకుంది. ఈ ఒత్తిడి ఇంకెన్నాళ్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన షేక్ షరీఫ్(43)ఎస్‌బీఐ బారకాస్ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 1000. రూ.500 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకులో పనిఒత్తిడి పెరిగింది.  ఈ నేపథ్యం లో శనివారం సాయం త్రం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిపో వడంతో సిబ్బంది ఆయన్ను హుటాహుటి న హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు.

 పెద్ద నోట్లు ప్రాణం తీశాయి
 కర్ణాటకలోని తుమకూరు జిల్లా చేళూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎం)లో నోట్ల మార్పిడికి శనివారం వృద్ధులకు అవకాశం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న సూలయ్యనపాళ్య గ్రామానికి చెందిన రైతు సిద్ధప్ప(68) రూ.500 నోట్లతో బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చున్నాడు. గంటల తరబడి నిలబడటంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిద్ధప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు