వైఎస్సార్‌సీపీ నేత తలశిల రఘురామ్​​కు కీలక బాధ్యతలు

23 Jun, 2019 19:14 IST|Sakshi

ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయ కర్తగా తలశిల రఘురామ్

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తలశిల రఘురామ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయ కర్తగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కీలక పదవి దక్కడంపై తలశిల స్పందిస్తూ... ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు.  

క్యాబినెట్ హోదాను హోదాలా కాకుండా బాధ్యతగా భావిస్తాననీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి గుర్తింపు తెచ్చుకునేలా పనిచేస్తానని, పథకాలను ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా పనిచేస్తానన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి, కార్యకర్తలకు మధ్య సంధానకర్త గా వ్యవహరించి బాధ్యతలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు