తాళ్లపాక తళతళ 

29 Jun, 2019 10:11 IST|Sakshi

సాక్షి, రాజంపేట(కడప) : పద కవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మస్థలం తాళ్లపాక. ఆయన తమ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సిద్దేశ్వరస్వాములను ఆరాధించేవారు. ఆ స్వాముల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. జూలై 11న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మపరిషత్‌ వారిచే హరికథ, సంగీత, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 12న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి చిన్నశేషవాహనసేవ నిర్వహిస్తారు. 
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు