అసలేం జరిగిందంటే..

7 Jul, 2014 02:31 IST|Sakshi
అసలేం జరిగిందంటే..

 సాక్షి, చెన్నె : తిరువళ్లూరు జిల్లా ఉప్పర పాళయం ఘటనలో మృత్యుంజయుడిగా మిగిలిన శెనగల నాగరాజు ప్రమాద విషయాన్ని ‘సాక్షి’కి వివరిం చాడు. మేస్త్రి సింహాచలంతో కలసి తండ్రి పెంట య్యతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం కొల్లు వలస, మోదుగువలస, కరవంజి గ్రామం, రాజుల పేట గ్రామాల నుంచి పది మంది రెండు వారాల క్రితం ఇక్కడికి వచ్చాం. తమకు ఇక్కడ గుడిసెలు వేయించి ఇచ్చారు. మా సారు(పేరు తెలియదు) శనివారం వచ్చి వేతనం ఇచ్చారు. మాలాగే, పది మంది చొప్పున మరి కొన్ని బృందాలు అక్కడ ఉన్నాయి. మాకు జీతాలు ఇచ్చే సరికి ఏడు గంటలైంది. కొన్ని బృందాల వాళ్లు వారి ఊళ్లకో, లేదా మరెక్కడికో వెళ్లారు.
 
 మేము అన్నం తిని మా గుడిసె బయట నిద్రించాం. పది గంటల సమయంలో ఈదురు గాలులతో వర్షం ఆరంభం అయింది. దీంతో లోపలికి వెళ్లి పడుకున్నాం. వర్షం ఎక్కువ అయింది. పన్నెండు గంటల సమయం లో బయటకు వచ్చి కాలకృత్యం తీర్చుకున్నాను. అప్పటికే వర్షం భారీగా పడుతోంది. తలుపు దగ్గరగా పడుకున్నా, ఆ తర్వాత రెండు గంటలై ఉంటుందేమో, చిమ్మ చీకటి, ఏమి తెలియడం లేదు. నా మీద బరువుగా ఏదో పడ్డట్టుంది. పక్కనే నిద్రిస్తున్న నాన్న పెంటయ్య కాళ్లు ఈడ్చుకుంటూ, కాసేపటికి జీవచ్చవంలా మారాడు. కాసేపు అరిచాను, ఎవరూ రాలేదు..అరచి..అరచి స్పృహ తప్పాను. ఉదయం 8 గంటలకు జేసీబీ రావడం కనిపించి అతి కష్టం మీద చేతులు ఊ పాను. అక్కడున్న సిబ్బంది వచ్చి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చారు.
 
 మా మేస్త్రి చచ్చిపోయాడు...నాన్నను కాపా డ లేకపోయాను. అమ్మ, అన్న ఊర్లో ఉన్నారు... తల తిరుగుతోన్నట్టుంది.... నన్ను మా ఊరికి పంపించండి.. అంటూ నాగరాజు బరువెక్కిన హృదయంతో తన వద్దకు వస్తున్న అధికారుల వద్ద వాపోతున్నాడు. తమకు ఎకరం పొలం ఉందని, వర్షాలు లేక, ఇక్కడ కూలి పనులకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జేబులో ఉండాల్సిన  నా కూలి, నాన్న కూలి డబ్బులు కన్పిం చడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
 
 ఆర్డీవో పరామర్శ : సంఘటనలో శ్రీకాకుళం జిల్లావాసులు ఉన్నారన్న సమాచారంతో నాయుడు పేట ఆర్‌డీవో ఎంవీ రమణ  రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి నుంచి స్టాన్లీ ఆస్పత్రికి చేరుకున్న రమణ, గాయపడ్డ నాగరాజును పరామర్శించారు. జ్యూస్, వాటర్ బాటిల్‌తో పాటుగా రూ.వెయ్యి ఖర్చులకు అందజేశారు. నాగరాజు ఇచ్చిన వివరాలతో తిరువళ్లూరుకు బయలుదేరి వెళ్లారు. తమ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినట్టు, తిరువళ్లూరు జీహెచ్‌లో ఉన్న మృతదేహాల్ని వారి వారి స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
 
 పెను ప్రమాదం తప్పినట్టే
 ఈ సంఘటనా స్థలంలో పెను ప్రమా దం తప్పినట్టు కన్పిస్తున్నది. నాగరాజు చెబుతున్న వివరాల్ని బట్టి చూస్తే, ఈ గోడ పక్కనే ఉన్న మరికొన్ని గుడిసెల్లో తలా పది మంది చొప్పున బృందాలు ఉన్నాయి. అరుుతే కూలి డబ్బులు తీసుకున్న దృష్ట్యా, ఈ బృం దాలు బయటకు వెళ్లిపోయూరుు. దీంతో ఈ ప్రమాదం బారి నుంచి వా రు బయట పడ్డారు. అయితే, వారంతా  తమ స్వగ్రామాలకు వెళ్లి ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిలో మరెంత మంది శ్రీకాకుళం వాసులు ఉన్నారో, మరెం దరు ఒడిశా వాసులోనన్నది విచారణలో తేలే అవకాశం ఉంది.
 
 అయితే, వేతనాలు తీసుకున్న పుణ్యమాని వర్షం వచ్చే ముందే, అక్కడి నుంచి జారుకుని ప్రమాదం నుంచి మరి కొందరు బయట పడగలిగారు. రూ. 90 వేలు లభ్యం :  సంఘటనా స్థలంలో బాధితుల వస్తువులను ఒక చోట చేర్చి అధికారులు తనిఖీలు చేశా రు. వారి బ్యాగుల్లో, దుస్తుల్లో ఏదేని చిరునామాలు, వివరాలు ఉంటాయని ఆరా తీశారు. ఈ సమయంలో అనేక మంది బ్యాగుల్లో, మృతుల జేబుల్లో డబ్బులు బయట పడ్డాయి. శనివారం వేతన దినం కావడంతో, వాటిని తీసుకుని భద్రత పరచుకున్నారని అధికారులు నిర్ధారించారు. మొత్తంగా రూ.90 వేలు ఉంటుందని భావిస్తున్నారు. వేతనాలు తీసుకున్న కూలీలను మృత్యువు కబళించడం ఆ పరిసర వాసులను శోక సంద్రంలో ముంచేసింది.
 

మరిన్ని వార్తలు