కామన్వెల్త్‌ వేదికపై తమ్మినేని

30 Sep, 2019 08:08 IST|Sakshi
స్పీకర్‌ తమ్మినేని దంపతులకు ఉగాండాలో స్వాగతం పలికిన శ్రీలంక ఎంబసీ కమలనాథన్‌

ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర శాసన సభాధిపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న తీరు, చట్టాల అమలుతోపాటు ఇటీవల ఆమోదం పొందిన పలు కీలక బిల్లుల విశేషాలను తన ప్రసంగంలో సవివరంగా తెలియజేశారు. సతీమణితో కలిసి వెళ్లిన ఆయనకు ఘన స్వాగతం లభించింది.  ఉగాండాలో నివసిస్తున్న తెలుగువారు స్పీకర్‌ దంపతులకు ఘన సన్మానం చేశారు.  

సాక్షి, శ్రీకాకుళం : ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు (సీడబ్ల్యూసీ) ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. తమ్మినేనితోపాటు ఆయన సతీమణి వాణీసీతారాం కూడా వెళ్లారు. స్పీకర్‌ దంపతులకు ఉగండాలో కంపల ఎయిర్‌పోర్టులో అక్కడ ఎంపీ, ప్రొటోకాల్‌ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీలంక ఎంబసీ కమలనాథ్‌న్‌తోపాటు ఇండియన్‌ ఎంబసీతో కలిసి లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. సీడబ్ల్యూసీ కాన్ఫరెన్స్‌లో సీతారాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న తీరు, చట్టాలు అమలుతోపాటు పలు కీలక బిల్లులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. కామన్వెల్త్‌ సభ్య దేశాలు, రాష్ట్రాల నుంచి హాజరైన స్పీకర్లు, ముఖ్యులు పాల్గొని తమ అనుభవాలను, తమ ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న అనుభూతులను తెలిజేశారు. పలు కొత్త అంశాలు తెలుసుకుని రానున్న సమావేశాల్లో వాటిని అమలుచేసేందుకు ఇటువంటి ఎంతో సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉగాండాలో నివసిస్తున్న తెలుగువారు స్పీకర్‌ దంపతులకు సన్మానించారు. స్పీకర్‌ దంపతులు పలు ప్రాంతాలను తిరిగి అక్కడి ఆచారాలు, పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తున్న తీరును తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు