ఆధారాలు చూపిస్తా.. ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేస్తారా?

22 Jul, 2018 08:19 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం

పొందూరు: ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ చేసిన అక్రమాలను ఆధారాలతో చూపిస్తా... అతనిని సస్పెండ్‌ చేయగలరా? అని వైఎస్సార్‌సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును సూటిగా ప్రశ్నించారు. స్థానిక పట్టుశాలీ కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన అ నంతరం రవికుమార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

 ఆగస్టు 15న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై సమాచారమందిస్తానని తెలిపారు. నదీతీర ప్రాంతాలైన నిమ్మతొర్లాడ, జీకే వలస, ముద్దాడ పేట, దూసి, గోపీనగరం, సింగూరు, పురుషోత్తపురం, పెద్దసవలాపురం, యరగాం గ్రామాల్లో ఇసుక ర్యాంపులను అనధికారంగా ప్రారంభించి ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. మైనింగ్, లిక్కర్, భూ మి, ఇసుక మాఫియాలకు అండగా నిలుచొని అక్రమాలకు పాల్పడటం శోచనీయమని చెప్పారు. ఇసుక ర్యాంపుల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా తనకు ఉన్నాయని ఆధారాలతో నిరూపిస్తే బహిరంగంగా ఉరి తీయండని సవాలు విసిరారు. 

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి జిల్లాల్లో భూములను విప్‌ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. శిక్షణ కార్యక్రమంలో  శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, మండల పార్టీ అ«ధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి బిఎల్‌ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి లోలుగు కాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంట్యాడ రమేష్, ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా