శక్తివంతమైన సాధనం మీడియా

26 Aug, 2019 08:21 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ఆర్కే తదితరులు

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

తాడేపల్లిలో ప్రెస్‌క్లబ్‌ ప్రారంభం

సాక్షి, తాడేపల్లి/గుంటూరు : రాజ్యాంగంలో నాల్గవ స్తంభంగా పిలిచే మీడియా అత్యంత శక్తివంతమైన సాధనమని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మీడియా పదును మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ సీతారాం మాట్లాడుతూ ఏ వార్తైనా వాస్తవంగా ఉంటేనే ప్రజల విశ్వసనీయత పొందుతుందని తెలిపారు. సోషల్‌ మీడియా ఎంత ఉపయోగిస్తున్నా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రాధాన్యత తగ్గలేదన్నారు. పత్రిక నిర్వహణ చాలా కష్టమని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పత్రికా రంగాన్ని కొనసాగిస్తున్నవారికి అభినందనలు తెలిపారు.

వ్యవస్థలను రక్షించుకోవాలంటే పత్రికలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. విలేకరులు దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కోవాల్సిన క్లిష్టపరిస్థితులు నేడు నెలకొన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పేది పాత్రికేయులేనన్నారు. వార్తను వార్తగా ఇచ్చే విధంగా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విలేకరుల సంక్షేమానికి తాను చేయూతనందిస్తానన్నారు. రాజధానిలో తొలి ప్రెస్‌క్లబ్‌ తాడేపల్లిలో ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ముందుగా ఆఫీస్‌ మెయిన్‌ గేటును జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ వెంకటాచార్యులు ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన ఎమ్మెల్యే ఆర్కే, విలేకరుల చాంబర్‌ను ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, కంప్యూటర్‌ రూమ్‌ను ఎమ్మెల్సీ ఏ.ఎస్‌.రామకృష్ణ, ప్రత్యేక రూమును వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాదె సుబ్బారెడ్డి, కార్యదర్శి టి.నాగేశ్వరరావు, కోశాధికారి టి.శివనాగిరెడ్డి పాల్గొన్నారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అడవిలో వృద్ధురాలు బందీ 

జనసేన కార్యాలయం​ ఖాళీ..

ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు

పేకమేడలా కట్టేస్తూ..

చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..

కాటేసిన కరెంటు

గుండె చెరువు!

వాల్తేరు ఉద్యోగుల్లో కలవరం

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం పాలేరు హత్య

నీరు పుష్కలం.. ప్రాజెక్టు నిష్ఫలం

ప్రభుత్వాన్ని పలుచన చేసే కుట్ర!

రాజధాని ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదు

మౌలిక వసతులు.. కార్పొరేట్‌ సొబగులు

ఎప్పుడైనా ఈకేవైసీ నమోదు

నేడు ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌

ఇసుక రెడీ.. 5 నుంచి సరఫరా

అన్యమత ప్రకటనలపై ప్రభుత్వం సీరియస్‌

గుట్టువిప్పిన శేఖర్‌ చౌదరి...

పీవీ సింధుకు గవర్నర్‌ అభినందనలు

షెడ్యూల్డ్‌ కులాలకు మూడు కార్పొరేషన్‌లు

పోలవరం అవినీతిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి : జీవీఎల్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘పులస’ ముక్క పంటికి తగిలితే..ఆహా..

అదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయం : అవంతి శ్రీనివాస్‌

సింధును చూసి భారత్‌ గర్విస్తోంది..

సీఎం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారు

మంత్రి వెల్లంపల్లి నివాసంలో విషాదం

టీటీడీ అధికారులతో సీఎస్‌ సమీక్ష

భారీ గణేశ్‌ను ఏర్పాటు చేస్తాం: భూమన

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం