‘ప్రశ్నిస్తే ప్రభుత్వంలో జవాబుదారీతనం’

2 Dec, 2019 17:03 IST|Sakshi

సాక్షి, అమరవతి: శాసనసభ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని  ఏపీ అసెబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు తీరును కమిటీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని తమ్మినేని తెలిపారు. పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జరుగుతున్న లోపాలను ప్రశ్నిస్తే ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం వస్తుందని స్పీకర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గోప్ప ప్రాధాన్యం ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆ ఫలాలను మహిళలకు అందేలా సలహాలివ్వాలని అసెంబ్లీ కమిటీలకు స్పీకర్‌ తమ్మినేని సూచించారు.

మరిన్ని వార్తలు