ఉత్తరాంధ్ర అభివృద్ధే  సీఎం ధ్యేయం

24 Dec, 2019 09:11 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నిరుపేదలకు విద్య, ఆరోగ్యం భారం కాకూడదనే దృఢ సంకల్పంతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టారని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతా రాం అన్నారు. శ్రీకాకు ళం ఎనీ్టఆర్‌ మున్సిపల్‌ ప్రాంగణంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన అధ్యక్షుడు పాలవలస విక్రాంత్‌ అభినందన సభను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్‌ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల కాలంగా పాలవలస కుటుంబానికి జిల్లా రాజకీయాల్లో అనుభవం ఉందని, దీనిలో భాగంగానే పాలవలస విక్రాంత్‌ వంటి సౌమ్యుడికి డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెట్టడం శుభపరిణామన్నారు. కష్టపడే ప్రతి ఒక్కరికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గుర్తింపునిస్తారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వైఎస్‌ జగన్‌ జిల్లాకు వచ్చి కిడ్నీవ్యాధిగ్రస్తులకు తాగునీటి ప్రాజెక్టుకు, ఆస్పత్రి నిర్మాణం, మత్య్సకారులకు జెట్టీల ఏర్పా టుకి శంకుస్థాపన చేసి ఇక్క డి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారన్నా రు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ప్రకటించారని తెలిపారు. దీనిపై టీడీపీ విమర్శలు చేయడం తగదన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌లు మాట్లాడుతూ పాలవలస విక్రాంత్‌ లాంటి మృదుస్వభావికి ఇలాంటి ఉన్నత పదవి అప్పగించడంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విక్రాంత్‌తో పాటు ఆరుగురు డైరెక్టర్లను స్పీకర్, ఎమ్మెల్యేలు దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పాలవలస రాజశేఖర్, ఇందుమతిలతో పాటు పార్టీ నాయకులు మున్సిపల్‌ మాజీ చైర్మన్లు ఎంవీ పద్మావతి, అంధవరపు వరం, గొండు రఘురాం అంధవరపు  సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, తమ్మి నేని చిరంజీవినాగ్, నర్తు రామారావు, నర్తు నరేంద్రయాదవ్, కిల్లి రామ్మోహన్, సురంగి మోహనరావు, ఎంవీ స్వరూప్, హనుమంతు కృష్ణారావు, హనుమంతు కిరణ్, మార్పు ధర్మా రావు, పిసిని చంద్రమోహన్, మార్పు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.     

బహుళ రాజధానులు మంచిదే
శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ బహుళ రాజధానులను శ్రీకృష్ణ కమిటీ, జీఎన్‌ రావు కమిటీలు నివేదికలు ఇవ్వకముందే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంపై రాష్ట్రప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరంలో ఉన్న పరిస్థితులను అవగాహన చే సుకుని అందుకు తగిన విధంగా ముందుకు నడిపించగలిగే సమర్థుడు పాలవలస విక్రాంత్‌ అని, అందుకే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తగి న గుర్తింపునిచ్చారన్నారు. దేశంలో రైతులకు అనుకూల పరిస్థితులు లేక వ్యవసాయంపై మొగ్గుచూపడం లేదన్నారు. రైతులు పండించిన పంటకు వారే ధర నిర్ణయించుకున్నప్పుడే వ్యవసాయంపై అంతా ఆసక్తి చూపిస్తారని అన్నారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
డీసీసీబీ నూతన చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో ఇంత బాధ్యత అప్పగించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకి చెందిన స్పీకర్‌ తమ్మి నేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతోపాటు మిగిలిన ఎమ్మెల్యేలంతా చైర్మన్‌ పదవిని అప్పగించేందుకు ఎలాంటి అడ్డుచెప్పకుండా ఏకాభిప్రాయంతో పదవిని అప్పగించడంపై స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. జిల్లాలో మార్చి నాటికి కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటుచేసి రూ.1500 కోట్ల లావాదేవీలతో బ్యాంక్‌ని ముందుకు నడిపిస్తానన్నారు. అన్ని పీఏసీఎస్‌లను కంప్యూటరైజ్డ్‌ చేసి సీఎం ఆశయాలు నెరవేరుస్తామన్నారు. బ్యాంకుల పురోగతికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో జిల్లాలో పెద్దలందరితో సంప్రదింపులు చేస్తానన్నారు. అంతేకాకుండా తనతో ఉన్న ఆరుగురు డైరెక్టర్ల సహకారంతో ముందుకు తీసుకెళ్తామన్నారు.   

మరిన్ని వార్తలు