అందరివాడు ఒకరైతే అందనివాడు మరొకరు

10 Apr, 2019 15:25 IST|Sakshi
తమ్మినేని సీతారాం, కూన రవికుమార్‌

సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ఎన్నికలు వస్తే పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరు..? వారి గుణగణాలు, కుటుంబ నేపథ్యం, సమాజసేవ వంటి విషయాలను ప్రజలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటారు. ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిని గెలిపిస్తే వారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా..లేక ప్రజాధనాన్ని దోచుకుంటారా అనేది బేరీజు వేసుకుంటారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు వారు చేసిన అభివృద్ధి ఎలా ఉంది. అవినీతిలో అతని స్థానం ఏంటనేది నియోజకవర్గాల్లో లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తమ్మనేని, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వివరాల్లోకి వెళ్తే...

తమ్మినేని సీతారాం
♦ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. 
 గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. 
♦ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై పట్టు ఉన్న వ్యక్తి
♦ సమస్య ఉందని ఆశ్రయిస్తే సత్వరమే స్పందించే గుణం కలవారు
♦ ఎంతో మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు
♦ రైతులకు సాగు నీరు అందించడానికి గతంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి

కూన రవికుమార్‌
♦ గత ఎన్నికల తరువాత ప్రజలకు దూరంగా ఉన్నారు
♦ స్థానికంగా కాకుండా శ్రీకాకుళంలో నివాసం ఉంటారు
♦ నియోజకవర్గం అభివృద్ధి కంటే తన అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి 
♦ నదీ గర్భాలను కొల్లగొట్టి కోట్లకు పడగెత్తారనే అభియోగం ఉంది 
♦ ఉద్యోగ అవకాశాలు కోసం వెళ్లిన యువతతో దురుసుగా మాట్లాడే స్వభావం
♦ బెదిరింపులు, రౌడీ రాజకీయం చేస్తారనే ఆరోపణ
♦ భూములను దోచుకునేందుకు కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి 

మరిన్ని వార్తలు