ఎన్‌కౌంటర్‌తో దిశ తల్లిదం‍డ్రులకు ఊరట లభించింది

6 Dec, 2019 12:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రజలకు నేడే అసలైన దీపావళి అని ఆంధ్రప్రదేశ్‌ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగిందన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘2012లో నిర్భయ ఘటన తర్వాత పోక్సో చట్టం ప్రవేశపెట్టినా అది సరిగా అమలు కాకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.

నిర్భయ నిందితుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఇలాంటి నిందితులకు మరణశిక్ష విధించాలని దేశం ముక్తకంఠంతో నినదిస్తోంది. దిశ కేసులో లాయర్లు కూడా నిందితుల తరపున వాదించడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌తో నిందితులు మరణించారు. దీనివల్ల చనిపోయిన దిశను తీసుకురాలేకపోయినా బాధితురాలి తల్లిదండ్రులకు కాస్తైనా ఊరట లభించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ’ని తానేటి వనిత స్పష్టం చేశారు.

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

>
మరిన్ని వార్తలు