‘సంక్షోభంలోనూ సంక్షేమం.. ఆ ఘనత ఆయనదే’

23 May, 2020 20:05 IST|Sakshi

మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత

సాక్షి, పశ్చిమగోదావరి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒకే ఒక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పలు సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఆమె తన క్యాంపు కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు,కార్యకర్తలకు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలో ఉన్న వృద్ధాశ్రమం లోనూ, వికలాంగుల ఆశ్రమం లోనూ పండ్లు పంపిణీ చేశారు.
(‘వారు కరోనాను మించిన వైరస్‌లు’) 

గర్వంగా ఉంది..
ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రజలకు అందించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ ప్రమాద బాధితులకు కోటి రూపాయలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. తక్కువ కాలంలో ఎక్కువ పథకాలు అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి చాలా గర్వంగా ఉందన్నారు.

ఆ ఘనత సీఎం జగన్‌దే..
మొదటి కేబినెట్ లోనే 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారన్నారు. మహిళల భద్రత కోసం మహిళ పక్షపాతిగా దిశా చట్టం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బెల్టుషాపులు రద్దు చేసి  మద్యపాన రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను  తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పేద విద్యార్థుల చదువు కోసం అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడయ్యారని తానేటి వనిత చెప్పారు.​


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా