గవర్నర్ ను, సీఎంను కలిసిన టాస్క్ ఫోర్స్ బృందం

29 Oct, 2013 21:18 IST|Sakshi

హైదరాబాద్:రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ బృందం విభజన అనంతరం తలెత్తే సమస్యలపై దృష్టి సారించిది. ఈ బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. ఈ సమావేశంలో విభజన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకునే అంశాలపై చర్చించారు.
 

శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను, విధానాలను అనుసరించాలనే దానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరో ఎనిమిది మంది కేంద్ర ఉన్నతాధికారులను టాస్క్‌ఫోర్స్ బృందంలో నియమించారు. ఈ బృందం మంగళవారం నుంచి గురువారం వరకూ హైదరబాద్ నగరంలో ఉండి రాష్ట్రానికి చెందిన 18 మంది ఐపీఎస్‌లతో సమావేశం కానుంది.

 

మరిన్ని వార్తలు