అభివృద్ధికి పన్ను పోటు

12 Mar, 2018 09:49 IST|Sakshi
కార్పొరేషన్‌ కార్యాలయం

పన్నుల వసూళ్లకు         మరో 20 రోజులే గడువు

జిల్లాలోని మున్సిపాలిటీల్లో 40శాతం మేర మాత్రమే వసూలు

రాష్ట్రంలో 11వ స్థానంలో     నెల్లూరు కార్పొరేషన్‌

ఇదీ మున్సిపల్‌శాఖ మంత్రి సొంత జిల్లాలో పరిస్థితి

నెల్లూరు సిటీ:  జిల్లాలోని మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్లలో వెనకబడి ఉన్నాయి. ఈ నెల 31తో పన్నుల వసూళ్ల గడువు ముగియనుంది. అయినా ఇప్పటి వరకు 40 శాతం మేర మాత్రమే పన్నులను వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 కార్పొరేషన్లు ఉండగా, పన్నుల వసూళ్లలో నెల్లూరు కార్పొరేషన్‌ 11వ స్థానంలో ఉంది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ సొంత జిల్లాలోనే ము న్సిపాలిటీలు పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉండడం విశేషం.

నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 1,17,456 లక్షల అసెస్‌మెం ట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌ 75 వేలు, కమర్షియల్‌ 25 వేలు, కాలువగట్లు, రైల్వే స్థలాల్లోని అసెస్‌మెంట్లు 11వేలు ఉన్నాయి. డబుల్‌ ఎంట్రీలు, నాట్‌ ట్రేసింగ్‌ కింద మరో 5వేలు అసెస్‌మెంట్లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కా ర్పొరేషన్‌ పరిధిలో మొత్తం రూ.74కోట్ల పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నా యి. అందులో ఈ ఏడాది రూ.33కోట్లు  వసూలు చేశా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.33కోట్ల పన్నులు వసూలు చే యాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.22 కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉంది. అలాగే గూ డూరు మున్సిపాలిటీలో 11,659, కావలిలో 21,947, సూళ్లూరుపేటలో 9,2 58, నాయుడుపేటలో 10,170, ఆత్మకూరులో 7,334, వెంకటగిరిలో12,000 అసెస్‌మెంట్లు ఉన్నా యి. సుమారు రూ.36 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.13 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.  లక్ష్యాలను సాధించేందుకు మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. అయినా ఇప్పటి వరకు కేవలం 40.47 శాతం మేర మాత్రమే పన్నులు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

బడాబాబుల జోలికి వెళ్లని రెవెన్యూ అధికారులు
నగర పాలక సంస్థ పరిధిలోని పేద, మధ్య తరగతి వర్గాలు పన్నులు చెల్లించకపోతే రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. కుళాయి కనెక్షన్లు తొలగించడం, చిన్నదుకాణాలను సీజ్‌ చేసి భయబ్రాంతులకు గురిచేసే అధికారులు బడాబాబుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. నగరంలోని మద్రాసు బస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రముఖ హోటల్‌ రూ.13లక్షలకుపైగా పన్ను బకాయి ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అలాగే దర్గామిట్టలోని ఓ మాల్‌ రూ.6లక్షలకుపైగా బకాయిు ఉంది. ప్రముఖులకు చెందినది కావడంతో రెవెన్యూ అధికారులు పన్నులు వసూలు చేయలేని పరిస్థితి. ఆర్టీసీ వద్ద ఓ లాడ్జి రూ.32లక్షల పన్ను బకాయి ఉంది. మద్రాసు బస్టాండ్‌ వద్ద కమర్షియల్‌ భవనం రూ.18లక్షలు బకాయి ఉన్నా అధికారులు పట్టించు కోవడం లేదు.  రాజకీయ నాయకుల పలుకుబడి ఉండడంతో అధికారులు వారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో  సుమారు రూ.15కోట్లకు పైగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. రెవెన్యూ అధికారులు బడాబాబులపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుంది.

మరో 20 రోజులే గడువు
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్ల గడువు మార్చి 31తో ముగియనుంది. ఉన్నతాధికారులు రెవెన్యూ వసూళ్లపై సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడంతో పన్నుల వసూళ్లలో వెనుకబడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతవర్గాల నుంచి పన్నులు వసూలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది పన్నుల వసూళ్ల లక్ష్యం 60శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు.  దీంతో మున్సిపాలిటీల అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకోనున్నాయి

మరిన్ని వార్తలు