ఏపీ మంత్రిపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు

2 Jan, 2018 11:15 IST|Sakshi

టీడీపీలో సోషల్‌ మీడియా వివాదం

కొవ్వూరులో​ బహిర్గతమైన వర్గ విభేదాలు

సాక్షి, కొవ్వూరు : ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి కె.జవహర్‌పై సొంత పార్టీ కార్యకర్తే  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్‌మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అంటూ మంత్రి జవహర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు టీడీపీ ఫేస్‌బుక్‌ పేజీలో జెడ్పీటీసీ విక్రమాదిత్య వర్గానికి చెందిన కార్యకర్తలు కామెంట్స్‌ పెట్టారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన మంత్రి మాట్లాడుదామని ఇంటికి పిలిచి చేయి చేసుకున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్రప్రసాద్‌ అనే కార్యకర్త మంత్రి జవహర్‌ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలోని అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పుడుతున్నారని, అనవసర కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  మంత్రిగారు తనపై చేయి చేసుకోవడమే కాకుండా చంపుతానని బెదిరించాడని సత్యేంద్రప్రసాద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా