శ్రవణ్‌ కుమార్‌ దళిత ద్రోహి

28 Aug, 2019 14:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని అంశం విషయంలో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌ కుమార్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్‌ అక్కడికి రావడానికి ముందే ఆయన అనుచరులు ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ప్రసంగించారు. ఈ క్రమంలో సమావేశ స్థలికి చేరుకున్న అసైన్డ్‌ భూముల రైతులు వారిని అడ్డుకుని శ్రవణ్‌ కుమార్‌ దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా దళితుల్ని చంద్రబాబు చిత్రహింసలు పెట్టినప్పుడు శ్రవణ్‌ కుమార్‌ ఎక్కడికి పోయాడని, దళితులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పుడు శ్రవణ్‌ కుమార్‌ ఏం చేశాడంటూ రైతులు ప్రశ్నించారు. జీవో నెంబర్‌ 41తో దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే అప్పుడు మాట్లాడని శ్రవణ్‌ కుమార్‌ ఇప్పుడు ఏం మాట్లాడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దళిత రైతులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు.

మరిన్ని వార్తలు