ఆగంతకుల స్వైర విహారం

10 Jun, 2019 13:21 IST|Sakshi
శిథిలమైన తెలుగుగంగ క్వార్టర్స్‌ను పరిశీలిస్తున్న సీఐ, ఎస్సైలు

వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్ద కేకలు, సవాళ్లతో వీరంగం

టీడీపీ రౌడీ మూకలుగా అనుమానం

భీతిల్లిన పులికల్లు గ్రామస్తులు

నలుగురిపై కేసు నమోదు

నెల్లూరు, పొదలకూరు: మండలంలోని పులికల్లు గ్రామంలో సుమారు 20 మంది ఆగంతకులు శనివారం అర్ధరాత్రి మద్యం తాగి స్వైర విహారం చేశారు.  బైక్‌ల్లో గ్రామంలో చక్కర్లు కొడుతూ కేకలు వేస్తూ, సవాళ్లు విసురుతూవీరంగం సృష్టించడంతో గ్రామస్తులు భీతిల్లారు. పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు.. పులికల్లు గ్రామానికి సమీపంలో పాడుపడిన తెలుగుగంగ క్వార్టర్స్‌లో శనివారం రాత్రి 20 మంది యువకులు బైక్‌లపై వచ్చి అక్కడే మాంసం వండుకుని, ఫూటుగా మద్యం తాగారు. తర్వాత బైక్‌లపై గ్రామంలోకి ప్రవేశించి వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకుల ఇళ్ల వద్ద ఆగి కేకలు వేయడంతో పాటు, సవాళ్లు విసిరారు. ఆగంతకుల కేకలకు గ్రామస్తులు భీతిల్లిపోయి అర్ధరాత్రి ఒకరికొకరు ఫోన్లు చేసుకుని గుమికూడి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కొందరు బైక్‌లను గ్రామంలో వదిలి పారిపోయారు. వెంటనే గ్రామస్తులు కండలేరు డ్యామ్‌ ఎస్సై లేఖాప్రియాంకకు సమాచారం అందించారు.

గ్రామస్తులు ఆ బైక్‌లను స్టేషన్‌కు తరలించి పోలీసులకు స్వాధీనం చేశారు. వచ్చిన ఆగంతకుల్లో గ్రామస్తులు నలుగురు యువకులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. వారిలో ఇద్దరు పులికల్లు గ్రామానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు అదే పంచాయతీ పర్వతాపురం గ్రామానికి చెందిన వారని తెలిసింది. ఇదే విషయాన్ని ఎస్సై కూడా ధ్రువీకరించారు. అనుమానితులు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని మిగిలిన ఆగంతకులను వివరాలు సేకిరించే పనిలో ఉన్నారు. పొదలకూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సైతో కలిసి ఆగంతకులు మద్యం సేవించిన శిథిల క్వార్టర్స్‌ను ఆదివారం పరిశీలించారు. ఆగంతకులు మద్యం సేవించిన ప్రాంతంలో టీడీపీ జెండాలు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా టీడీపీకి చెందిన రౌడీమూకలుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు.  ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో వివాదాలు చోటు చేసుకున్నాయని, పాత కక్షలను మనస్సులో పెట్టుకుని టీడీపీకి చెందిన వారే వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడేందుకు బయట వ్యక్తులను పంపినట్టుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రివర్స్‌ టెండరింగ్‌!

చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే

భూముల సమగ్ర సర్వే

సమాన స్థాయిలో టూరిజం అభివృద్ధి..

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం..

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మేజర్‌ జనరల్‌

కొత్త రాజ్‌ భవన్‌ను పరిశీలించిన గవర్నర్‌ కార్యదర్శి

హోదాపై కేంద్రాన్ని నిలదీసిన మిథున్‌ రెడ్డి

వైఎస్సార్‌ హయాంలోనే చింతలపుడి ప్రాజెక్టు

అడ్డంగా దొరికి.. పారిపోయి వచ్చారు

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

ఏపీలో రాజ్‌భవన్‌కు భవనం కేటాయింపు

ఎక్కడికెళ్లినా మోసమే..

పసుపు–కుంకుమ నిధుల స్వాహా!

ఏళ్లతరబడి అక్కడే...

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం