పది రోజుల్లో ఇసుక సమస్యకు పరిష్కారం : ఎంపీ

3 Oct, 2019 20:47 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : గత ప్రభుత్వం ఎక్కడా లేని అప్పులు చేసి అంతా కన్ఫ్యూజ్‌ చేసి పెట్టారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. గురువారం పాలకోడేరు మండలం వేండ్రలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు వైఎస్సార్‌సీపీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వారం, పది రోజుల్లో ఇసుక కొరత లేదు అనే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అసాధారణ నిర్ణయమని తెలిపారు. దేవాలయ కమిటీల్లో, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవుల్లో 50 శాతం మహిళలకే ప్రకటించిన మహిళా పక్షపాతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, ఉండి నియోజకవర్గ కన్వీనర్‌ పివిఎల్‌ నరసింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్‌ కౌరు శ్రీనివాస్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రబాబు, భూపతిరాజు, సత్యనారాయణరాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు