టీడీపీది గూండాగిరీ

1 Mar, 2017 12:56 IST|Sakshi
టీడీపీది గూండాగిరీ

► ఎన్ని దౌర్జన్యాలు చేసినా వైఎస్‌ వివేకా గెలుపు ఖాయం
► రౌడీయిజం,అధికార దుర్వినియోగంతో ప్రజల మన్ననలు పొందలేరు
► వైఎస్‌ వివేకా,  ఆకేపాటి, ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ ధ్వజం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ గూండాగిరి చేస్తోందని, సీఎం నుంచి కిందిస్థాయి వరకు దౌర్జన్యానికి పాల్ప డుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవా రం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమ మా ర్గాల ద్వారా గెలుచుకోవాలని చూస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తామెప్పుడూ చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేక టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని  అడ్డగోలుగా, అడ్డదారిలో ప్రతి పక్షపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను భయపెట్టి, ఆయా కుటుంబాలను చంపుతామంటూ భయోత్పాతం సృష్టిస్తుండడం సిగ్గుగా లేదా?  అని సీఎంను ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తుపై గెలి చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడడం దారుణమన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అంజద్‌బాషానగర నడిబొడ్డున,  పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయా ల సమీపంలోనే టీడీపీ నాయకులు  తమ కార్పొరేటర్‌  పై దాడికి దిగడం   తగునా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కడప నగరంలో ప్రశాంత వాతావరణం ఉంటోందని, అటువంటి వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఫ్యాక్షన్ సంఘటనలకు ఆలవాలంగా టీడీపీ నాయకులు మార్చడం విచారకరమన్నా రు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ప్రజాబలం ఉంటే తమ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల విశ్వాసం పొందితే అప్పుడు నిజమైన నాయకుడని ఒప్పుకుంటామన్నారు. మేయర్‌ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ వైఎస్‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్రభుత్వం దురాగతాలకు పాల్పడుతోందన్నారు. టీడీపీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లి అక్కడ లబ్ధిపొంది మళ్లీ టీడీపీలోకి వచ్చి ఇక్కడా లబ్ధి్దపొందుతూ ఇత ర పార్టీల నాయకులను విమర్శించడం తగదన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే ముందు అటు శ్రీనివాసులురెడ్డి, ఇటు ఆదినారాయణరెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని మా ట్లాడితే బాగుంటుందన్నారు. ఫ్యాక్షన్ వద్దు....ఫ్యాషన్ ముద్దు అన్న నాయకు లు ఇప్పుడు చేస్తున్న దురాగతాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, జెడ్పీ వైస్‌ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈసీని కలుస్తాం: వివేకా
ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికను ఎదుర్కోలేక టీడీపీ నేతలు అక్రమ మార్గాలను ఎంచుకున్నారని ఆరోపించారు. ఎన్ని నీచ రాజకీయాలు చేసినా, బెదిరింపులకు దిగినా, దౌర్జన్యాలకు పాల్పడినా తమ పార్టీ ప్రజాప్రతినిధులు  తమకు అండగా ఉంటున్నారన్నారు. ఎన్నికలో టీడీపీ దుర్మార్గ రాజకీయాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నందునా ఈ జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని కేటాయించాలని ఎన్నికల కమిషన్ను కలిసి విన్నవిస్తామన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను కలిసి ఇక్కడి విషయాలను  తెలియజేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు