టీడీపీ దిగజారుడు రాజకీయం !

19 Jun, 2014 03:02 IST|Sakshi
టీడీపీ దిగజారుడు రాజకీయం !

 జలుమూరు, న్యూస్‌లైన్: చల్లవానిపేట, అల్లాడ ప్రాథమిక సహకార సం ఘాల అధ్యక్షులను తప్పించేందుకు కుట్ర జరుగుతున్నట్టు తెలిసింది. ఎన్నికల అనంతరం ఇటీవల టీడీపీలో చేరిన ఓ మండల నాయకుడు మం త్రాంగంతో వీరిపై అవిశ్వాసం తీర్మానం పెట్టి గద్దె దించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. చల్లవానిపేట, అల్లాడ పీఏసీఎస్‌లకు అధ్యక్షులుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడంతో  వీరిని ఎలాగైనా తప్పించేందుకు కొంతమంది టీడీపీ నాయకుల సహకారంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వారం రోజల క్రిందట పథక రచన జరిగినట్టు సమాచారం.
 
 వాస్తవంగా ‘దేశం’ అధినాయకత్వానికి అవిశ్వాస తీర్మాన పద్ధతి  ఇష్టం లేకపోయినా అంతా దగ్గరుండీ నేను నడిపిస్తానని మండల నాయకుడు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. గతంలో కూడా మండల సర్పంచ్‌ల అధక్షుడి ఎన్నికల్లో కూడా ఇదే నాయకుడు టీడీపీకి చెందిన  సర్పంచ్‌ల వర్గానికి ఓ వ్యక్తిని అధ్యక్షుడిగా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వైఎస్‌ఆర్ సీపీ సర్పంచ్‌లు చాక చక్యంగా తిప్పికొట్టడ ంతో అప్పట్లో మిన్నకుండి పోయాడు. జలుమూరు మండలంలో బలంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బతీసే విధంగా ఈ నాయకుడు ఇప్పుడు పావులు కదుపుతున్నారు. అల్లాడ సొసైటీలో మొత్తం 13 టీసీలు ఉన్నారు.
 
 వీరిలో  ఏడుగురు అవిశ్వాస తీర్మాన పత్రాలపై సంతకాలు చేసి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ డీఅర్‌కు ఇప్పటికే నోటీసీలు ఇచ్చారు. చల్లవానిపేట సొసైటీలో కూడా 13 సభ్యులు ఉండగా, అవిశ్వాస తీర్మానం చేసేందుకు 8 మంది నోటీసులు పంపారు. అయితే నోటీసులు పంపేందుకుఏడుగురు సరిపోతారు కానీ అవిశ్వాసం పెట్టేందుకు మాత్రం కోరమ్ సభ్యులు 9 మందికి తక్కువగా ఉండకూడదని సొసైటీ అధికారులు చెబుతున్నారు. కాగా కొద్ది రోజుల కిందటే అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పుడే దిగజారుడు రాజకీయాలకు పాల్పడడంపై పలువురు మండిపడుతున్నారు.   
 

మరిన్ని వార్తలు