నెల్లూరులో.. టీడీపీ తెగింపు!

9 Apr, 2019 16:25 IST|Sakshi

కావలిలో అరాచకాలకు కుట్ర

అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లపై దృష్టి లేకుండా టీడీపీ కుయుక్తులు

పట్టించుకోకుండా ఉండేలా అధికారులపై ఒత్తిళ్లు

84 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులు చేసేందుకు యత్నం

కావలి:  కావలి నియోజకవర్గంలో ఒక పక్క ఓటమి భయం.. మరో పక్క అసహనంతో రగిలిపోతున్న టీడీపీ అరాచకం సృష్టించి రిగ్గింగ్‌ ద్వారా ఓట్లు పోల్‌ చేసుకునేందుకు భారీ కుట్రకు తెగించింది. ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు, వివాదాలు, ఉద్రిక్తతలు నెలకొనే అత్యంత సమస్యాత్మక పరిస్థితులు ఉన్న పోలింగ్‌ బూత్‌లపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టకుండా ఉండేలా టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. మొన్నటి వరకు కావలి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాలు, టీడీపీలో బీద సోదరుల వర్గాలు ఉండేవి.

తాజాగా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విష్ణు, బీద వర్గాలు ఒకటి కావడంతో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీస్‌ బలగాలు లేకుండా చేసుకుని ఏకపక్షంగా పోలింగ్‌ నిర్వహించుకోవాలనేది టీడీపీ కుట్ర. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రత్యేక బలగాలు పహరా ఉంటే తమ ఆటలు సాగవనేది వారి అభిప్రాయం. 

84 పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకం
నియోజక వర్గంలో 84 పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. వీటిల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు ఎలాంటì అవాంఛనీయమైన పరిస్థితులు ఎదురైనా ధీటుగా తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారు నిర్ణయించారు. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు, ఈ 84 పోలింగ్‌ బూత్‌ల్లో తాము నియమించుకొన్న పోలీసు అధికారుల ద్వారా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని భారీ కుట్రలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్‌కు పాల్పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

దీన్ని అమలు పరచడానికి వీలుగా అధికారులు ఆ పోలింగ్‌ కేంద్రాలు వద్ద  ఈ నెల 11 వ తేదీ జరిగే పోలింగ్‌ సందర్భంగా మొక్కుబడిగా పోలీసులను నియమించాలని అధికారులకు చెబుతున్నారు. కావలి నియోజకవర్గంలోని మొత్తం 314 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఇందులో అల్లూరు మండలంలో 46 పోలింగ్‌ బూత్‌లు అత్యంత సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. అల్లూరు మండలంలోని రాయిపేట పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 268, గాలిదిబ్బలు 280, ఇస్కపల్లి గ్రామంలోని 283 నుంచి 294 వరకు ఉన్న పోలింగ్‌ బూత్‌లు, అల్లూరులోని 261 నుంచి 281 వరకు, సింగపేటలోని 258 నుంచి 260 వరకు, పురిణిలోని 299 నుంచి 301 వరకు, మోపూరులోని 304 నుంచి 308 వరకు ఉన్న పోలింగ్‌ బూత్‌లు అత్యంత సమస్మాకత్మమైనవిగా భావించి పోలింగ్‌కు భారీ భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బోగోలు మండలంలో 21 పోలింగ్‌ బూత్‌లు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినవిగా గుర్తించారు.

జువ్వలదిన్నె, చెన్నారాయునిపాళెంలో 168 నుంచి 178 వరకు, ఎస్వీపాళెంలోని 179, 180 పోలింగ్‌ బూత్‌లు, కోవూరుపల్లిలో 185, నాగులవరంలో 202 నుంచి 205 వరకు, జక్కేపల్లిగూడూరులో 207, 208 పోలింగ్‌ బూత్‌లు, ఏబీ కండ్రిగలో 209 పోలింగ్‌ బూత్‌లో జాగ్రత్త చర్చలు తీసుకోవాల్సి ఉందని గుర్తించారు. కావలి రూరల్‌ మండలంలో 17 పోలింగ్‌ బూత్‌ల విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని నిర్ధారణకు వచ్చారు. వాటిలో చలంచర్లలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 8, పెద్దపట్టపుపాళెంలో 23, 24, 25, అన్నగారిపాళెంలో 152, 153, తుమ్మలపెంటలో 141 నుంచి 149 వరకు, చెన్నాయపాళెంలో 24, 25, 26 పోలింగ్‌ బూత్‌లు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు