టీడీపీ వరద రాజకీయం

17 Aug, 2019 04:51 IST|Sakshi

చంద్రబాబుపై దాడికి కుట్ర పన్నారని, బాంబులు వేస్తున్నారని హడావుడి 

అక్రమ నివాసం ముంపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు పన్నాగం  

సాక్షి, అమరావతి: ‘డ్రోన్ల ద్వారా నాపై దాడికి కుట్ర పన్నారు. వరదల్ని కావాలని రప్పించి నా ఇంటిని ముంచేలా ప్లాన్‌ చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచుతున్నారు. చంద్రబాబు ఇంటిపై బాంబులు వేసేందుకు ఇద్దరు వచ్చారు’.. కృష్ణా నది వరదల సాక్షిగా టీడీపీ బురద రాజకీయానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఉండవల్లి కరకట్టపై ఉన్న తన ఇంటిని ముంచేందుకు ఉద్దేశపూర్వకంగా వరద సృష్టించారని చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న హంగామా చూసి అధికారులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తనను అంతమొందించేందుకు డ్రోన్లు ప్రయోగించారని చంద్రబాబు నెత్తీ నోరూ కొట్టుకోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ శుక్రవారం డ్రోన్‌ కెమెరాతో బ్యారేజీ ఎగువన వరద పరిస్థితిని చిత్రీకరించింది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి వద్ద చిత్రీకరిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు డ్రోన్ల ద్వారా చంద్రబాబు ఇంటిపై బాం బులేయడానికి వచ్చారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నీటి పారుదల శాఖ ఖండించింది. డ్రోన్ల ద్వారా చిత్రీక రణకు తామే ఒక ఏజెన్సీ ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని పంపా మని చెప్పడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు. బాబు ఇంటిని ముంచే ందుకు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా బ్యారేజీలో వరదను సృష్టిం చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. 

గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరదను ఆపారట! 
ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవలను అడ్డుగా పెట్టి ఉండవల్లిలోని నివాసాన్ని ముంచాలని చూస్తున్నారని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ఆరోపణలకు దిగడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. కృష్ణా నది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసం ముంపునకు గురైన విషయాన్ని పక్కదారి పట్టించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, ఆయన పరివారం ఈ రాద్ధాంతం సృష్టించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మరిన్ని వార్తలు