కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

23 Sep, 2019 03:27 IST|Sakshi
చికిత్స పొందుతున్న  కమతం శివకృష్ణ, తలకు కుట్లు చూపుతున్న వాకాటి మనీంద్ర  

ముగ్గురు వైఎస్సార్‌సీపీ నాయకులకు తీవ్ర గాయాలు

ఒకరి పరిస్థితి విషమం

సాక్షి, కొడవలూరు  : వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని తలమంచిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. తలమంచి దళితవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయుడు కమతం శివకృష్ణ, అదే ప్రాంతానికి చెందిన టీడీపీ వర్గీయుడు చింతా రవిల మధ్య పాత కక్షలున్నాయి. చింతా రవి పద్మనాభసత్రం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

తలమంచి గ్రామంలో గత బుధవారం నుంచి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు కమతం శివకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుండడంతో ఆయన ఉత్సవాలు జరుగుతున్న చోటే తన వర్గీయులతో ఉంటున్నాడు. దీన్ని గుర్తించిన చింతా రవి వ్యూహాత్మకంగా తన వర్గీయులతో శివకృష్ణతోపాటు ఆయన వర్గీయులపై శనివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేశారు. ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలోనే శివకృష్ణ అతని అనుచరులపై విచక్షణా రహితంగా కత్తులతో విరుచుకుపడి దాడి చేశారు. ఈ దాడిలో శివకృష్ణ గడ్డం మెడ భాగం తెగింది.

వాకాటి మనీంద్రకు తలకు, కమతం మనీంద్ర భుజంపై బలమైన గాయాలయ్యాయి. గడ్డం, గొంతు తెగిన శివకృష్ణను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కత్తులతో దాడికి పాల్పడ్డ చింతా రవి, ఆయన అనుచరులు చింతా మాధవ్, చింతా ప్రసాద్, చింతా నరేష్, చేవూరు వెంకటేశ్వర్లు, చేవూరు నాగేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

వివిధ కేటగిరీల్లో టాప్‌ 15ర్యాంకులు

బోటు ప్రమాదంపై కిషన్‌రెడ్డి సమీక్ష

రాధాకృష్ణా.. ‘ఓపెన్ హార్ట్’ ఉందా?

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబుకు లేఖ రాసే అర్హత ఉందా...?

'రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు'

ఆరుగురికి సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

‘ఆరోగ్యశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు’

'వైఎస్‌ జగన్‌ ఒక డైనమిక్‌ లీడర్‌'

'టీడీపీ ఒక తెలుగు దొంగల పార్టీ'

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!

'ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ పేలలేదు'

చంద్రబాబు సెల్ఫ్‌గోల్‌ ....! 

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌

మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఎమ్మెల్యే

చంద్రబాబూ..బురద చల్లడం మానుకో!

కుదిపేసిన వాన.. కుదేలైన అన్నదాత

జిల్లాలో ఒక్క పోస్టుకు ఆరుగురి పోటీ..

టెండర్‌.. ఏకైక కాంట్రాక్టర్‌!

అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో కుండపోత

కోడెల కాల్‌డేటానే కీలకం!

 కాంట్రాక్టు డ్రైవర్లకు తీపి కబురు

ఆశల తీరాన.. గంగపుత్రులకు నజరానా!

అమ్మ జాతర ఆరంభం

జిల్లాలో ఉద్యోగానందం..

అధికారుల ముంగిట అభ్యర్థుల భవితవ్యం

దేశవ్యాప్తంగా అమ్మ ఒడిని అమలు చేయండి

పెళ్లికి ముందు కూడా.. స్పెర్మ్‌కూ ఓ బ్యాంకు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా సైరా: చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’