ఎవరి కోసం ఈ సంబడం..!

13 Jan, 2015 03:23 IST|Sakshi
ఎవరి కోసం ఈ సంబడం..!

 బొబ్బిలి :టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇ చ్చిన హామీలను నెరవేర్చలేని ప్రభుత్వానికి అసలు సంక్రాంతి సంబరాలు జరిపే అర్హత లేదన్నారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకూ ఏ ఒక్క రం గానికి చెందిన వారు కూడా సంతోషంగా లేరని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పండి.. పంట ఇంటికి వస్తే సం క్రాంతి కళ ప్రతి ఇంట, గ్రామానికి వ స్తుందన్నారు. గత ఏడాది వచ్చిన హుద్‌హుద్ తుపానుకు రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం ఇచ్చే పరి హారం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
 
 లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో గత ఏడాది చెరుకుకు ఇప్పటివరకూ చెల్లింపులు చేయలేదని, డిసెంబరు 31లోగా గడువు ముగిసినా పది కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదని చెప్పా రు. సరిపడిన ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయక రైతులు దళారుల బారిన పడ్డారని, కేంద్రాలకు ఇచ్చిన ధా న్యానికి కూడా నేటి వరకూ చెల్లింపులు జరగలేదన్నారు. ఇన్ని బాధలు మిగిల్చిన చంద్రబాబు సంబరాలను చేయడం హా స్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలోని జూట్, చక్కెర, ఫెర్రో పరిశ్రమలను ఆరునెలలుగా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో వేలాది కార్మిక కుటుంబాలు రో డ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ర
 
 ుణమాఫీ విషయంలోనూ రైతుల ను మోసగించారన్నారు. దివంగత నేత  వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్హులందరికీ పింఛన్లు ఇస్తే టీడీపీ ప్రభుత్వం వాటిని ఐదు రెట్లుకు పెంచుతున్నామని చెప్పి, అర్హులను తొలగించారన్నారు. టీడీపీ కార్యకర్తలతో కార్యక్రమాలు నడుపుతూ ప్రజాప్రతినిధుల విలువ తగ్గిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాం లో ఇందిరమ్మ కమిటీలు పెట్టి అర్హులందరికీ న్యాయం చే స్తే ఇప్పుడు టీడీపీ వేసిన కమిటీలు పథకాల్లోని అర్హులకు కోత పెట్టడానికే సరిపోతున్నాయన్నారు. సం క్రాంతి సందర్భంగా ఆరు వస్తువులు ఇస్తామన్న ప్రభుత్వం అరకొరగా అందించడమే కాకుండా కొన్ని దగ్గర్ల ఇంకా ప్రా రంభం కాని పరిస్థితి ఉందన్నారు. సం క్రాంతి సంబరాలను పార్టీ  తరఫున వ్యతి రేకిస్తున్నామని తెలిపారు. ఆయనతో పాటు ఫ్లోర్ లీడరు రౌతు రామ్మూర్తినాయుడు, ఎంపీపీ గోర్జి వెంకటమ్మ, తెర్లాం జెడ్పీటీసీ సభ్యురాలు నర్సుపల్లి వెంకటరామలక్ష్మి, కౌన్సిలర్లు మరిపి తిరుపతిరావు, మడక తిరుపతి, రాయలు, బొబ్బాది, కాకల వెంకటరా వు, వి. శ్రీరాములునాయుడు,  తదితరు లు పాల్గొన్నారు.
 
 ప్రభుత్వాలపై ఆధారపడకూడదు
 మానవ జీవితానికి గురువు ఎంతో ము ఖ్యమైన వ్యక్తి అని, విద్యార్థులు సరైన గురువును ఎంపిక చేసుకుని, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నా రు. సోమవారం ఇందిరమ్మ కాలనీలోని శ్రీరక్షా సర్వీసు మిషన్ ఆధ్వర్యంలో జరి గిన స్వామి వివేకానంద జయంతి సభ లో ఆయన మాట్లాడారు. వివేకానంద హిందుత్వం కోసం సమాజాన్ని చైతన్య పరచడంలో కీలక పాత్ర పోషించారన్నా రు. ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురుచూస్తూ ప్రజల్ని సోమరి పోతులుగా చేస్తుందని, అలా ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వాలపై ఆధార పడడం కూడా తగ్గిందన్నారు. యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని సూ చించారు.
 
 ఏపీఎన్‌జీఓ సంఘ నాయకు డు, మున్సిపల్ ఫ్లోర్ లీడరు రౌతు రా మ్మూర్తినాయుడు మాట్లాడుతూ యువతకు మానసిక అభివృద్ధితో పాటు మంచి ఆలోచనలు ఉండాలన్నారు. అభిమాని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రెడ్డి రాజగోపాలనాయుడు మాట్లాడుతూ యువత కు వివేకానంద స్ఫూర్తిగా ఉన్నారని, ఆ బాటలో మనమంతా నడవాలన్నారు. అనంతరం వికలాంగులకు స్టాండ్, పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ దూళి శేఖర్, ఏ ఎస్‌ఐ మల్లికార్జున రావు, మిషన్ అధ్యక్షుడు తుమరాడ గంగాధర్, వ్యవస్థాపకుడు కిశోర్‌కుమార్ , కౌన్సిలరు మరిపి తిరుపతిరావు, బొబ్బాది తవిటినాయు డు, కాకల వెంకటరావు, గంగుల మదన్‌మోహన్, వాడపల్లి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు