ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడాలి

22 Jun, 2016 03:26 IST|Sakshi

 చింతలపూడి : ‘సాక్షి’ ఛానల్‌పై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా చింతలపూడిలో అఖిలపక్ష పార్టీల నేతలు ధ్వజమెత్తారు. సాక్షిపై వేధింపులు మానాలని, సాక్షి ఛానల్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం పట్టణంలో కదం తొక్కారు. స్థానిక పాతబస్టాండ్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
 
 అక్కడి నుంచి ప్రదర్శనగా బోసుబొమ్మ సెంటర్ చేరుకుని రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు డు ఎం.వసంతరావు, మండల కార్యదర్శి జంగా రామచంద్రారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.థామస్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్‌వీ సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు కె.చంద్రశేఖర్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి మాట్లాడుతూ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.
 
 భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి నశించాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ మండల మహిళా అధ్యక్షురాలు సాదరబోయిన వరలక్ష్మి, ఎంపీటీసీ యండ్రపాటి కుమారి, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షులు ఎం.ఇమ్మానియేలు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి బొల్లం రామారావు, వెంకటాద్రిగూడెం సర్పంచ్ మేడి రాములు, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు ఎస్.కాంతారావు, వార్డు సభ్యులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు