ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు

25 Jun, 2020 12:21 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఆయనను ఏసీబీ విచారణ చేయనుంది. కాగా ఈ కుంభకోణంలో అరెస్ట్‌ అయిన అచ్చెన్నాయుడు, రమేష్‌ కుమార్‌ను మూడు రోజుల పాటు, విజయ్‌కుమార్‌, జసదన్‌, చక్రవర్తి, వెంకట సుబ్బారావులను రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్‌ఛార్జ్‌ న్యాయమూర్తి వెంకటరమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.(ఈఎస్‌ఐ స్కామ్‌ : ఏసీబీ కస్టడీకి అనుమతి)

కాగా రాజమండ్రి జైలులో ఉన్న డైరెక్టర్లు రమేష్ కుమార్, విజయ్ కుమార్, వేణుగోపాల్, వెంకట సుబ్బారావు, మరో వ్యక్తిని పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో విజయవాడకు తరలించారు. రెండు రోజుల విచారణ అనంతరం మళ్ళీ వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఏసీబీ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏసీబీ డీజీతో అధికారులు భేటీ అయ్యారు. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన నిందితుల నుంచి రాబట్టాల్సిన అంశంపై చర్చలు జరిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు