మీ బండారం ఇదీ!

2 Jul, 2020 13:32 IST|Sakshi

ఫార్మా కంపెనీ ప్రమాదంపై  టీడీపీ నేత వింత ధోరణి

వివాదాస్పద వ్యాఖ్యలతో నానాయాగీ

విష ప్రచారం చేయబోయి అభాసుపాలైన మాజీ మంత్రి బండారు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రసాయన చర్య వికటించి వెలువడిన విషవాయువుల కంటే తెలుగుదేశం నేతల విష ప్రచారమే పెను ప్రమాదంగా కనిపిస్తోంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌ ఫార్మా కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన సాకుగా టీడీపీ నేత బండారు చేసిన నానాయాగీ అందరికీ ఏవగింపు కలిగించింది. సాయినార్‌ కంపెనీలో రెండు రియాక్టర్‌లలో ఉన్న వేర్వేరు బల్‌్కడ్రగ్‌ల మిశ్రమం వల్ల రసాయన చర్య వికటించి ప్రమాదవశాత్తూ వెలువడిన విషవాయువుతో ఇద్దరు మృత్యువాత పడటం, నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన తోటి ఉద్యోగులు వెంటనే యూనిట్‌ను షట్‌డౌన్‌ చేయడం, జిల్లా ఉన్నతాధికారులు అర్ధరాత్రి వేళ కూడా హుటాహుటిన ఘటనాస్థలికి చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ ఘటనను కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడటమే విమర్శల పాలవుతోంది.

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేతగా చెలామణీ అవుతున్న బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ జీవితం మసకబారుతుండడంతో తన ఉనికిని చాటుకునేందుకు దిజజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న వాదనలకు సాయినార్‌ ఫార్మా వద్ద ఆయన చేసిన నానాయాగీ బలం చేకూరుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడి వయసు ఉన్న అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన బండారు ఏడాదిగా అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా నోటికొచి్చనట్టు మాట్లాడుతూ వస్తున్నారు.

బండారు బలవంతపు వసూళ్లు
బండారు గతంలో ప్రజాప్రతినిధిగా చెలామణీ అయినప్పుడు.. పరవాడలోని ఫార్మా సిటీలోని కంపెనీల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. కంపెనీల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్యాలను బెదిరించి దందాలు చేసేవారన్న వాదనలున్నాయి. మరోవైపు ఫార్మా, ఎన్టీపీసీ కంపెనీలోనూ, ఆర్‌ఈసీఎస్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ కుమారుడి ద్వారా నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటని్నంటినీ కప్పిపుచ్చుకోవడానికే ఏదైనా ఘటన జరిగేతే చాలు... పోరాటం ముసుగులో బండారు అధికారపక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న వాదనలున్నాయి.

అనుచరుల ముసుగులో భూ కబ్జాలు.. 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అనుచరుల ముసుగులో బండారు లెక్కలేనన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములతో పాటు దళితులు, బీసీల వద్ద ఉన్న అసైన్డ్, డీ–ఫారం భూములను సైతం చెరబట్టారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూములను లాక్కునేందుకు ఓ మహిళను స్వయంగా బండారు కుమారుడు డైరెక్షన్‌లో వివస్త్రను చేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. అందులో ప్రధాన నిందితురాలు అయిన టీడీపీ నాయకురాలు, మాజీ వైస్‌ ఎంపీపీ మడక పార్వతికి తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెందుర్తి జెడ్పీటీసీ టికెట్‌ కేటాయించారు. లాక్‌డౌన్‌కు ముందు ఆమె తరపున బండారు, ఆయన కుమారుడు అప్పలనాయుడు ప్రచారం కూడా చేశారు.

ఇక 2014లో ముదపాక అసైన్డ్‌ భూముల కుంభకోణంలో ప్రధాన సూత్రదారి బండారు, అప్పలనాయుడు అనుచరులు స్థానికంగా ఉన్న పట్టాదారులను బెదిరించి వారికి రూ.లక్ష చొప్పున అడ్వాన్స్‌లు ఇచ్చి రూ.కోటి భూమిని అప్పనంగా కొట్టేయడానికి యత్నించారు. అలాగే పినగాడి సమీపంలో పెంటవాని చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ గయాళు భూమిని ఎన్టీఆర్‌ హౌసింగ్‌కు కేటాయించేందుకు బండారు 2017లో ప్రతిపాదించారు. కానీ సాంకేతిక కారణాల వలన ఆ ప్రయత్నం ఆగిపోయింది. అయితే అప్పట్లో వైఎస్సార్‌సీపీ కారణంగానే పేదలకు ఇళ్లు ఇవ్వడం కుదరలేదని బండారు అప్పట్లో ఆరోపించారు. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అదే భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధపడితే.. బండారు స్థానిక రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారు. హైకోర్టులో  కేసులు వేయించి ఆ భూమిపై తాత్కాలికంగా స్టే తెచ్చారు.

బండారు.. రెండు నాల్కల తీరు
పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలో జరిగిన గ్యాస్‌ లీకేజీ ప్రమాదంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నం చేసిన బండారు 2015లో ఇదే కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అప్పుడు కనీసం కంపెనీపై ఈగ వాలనివ్వలేదు సరికదా.. ప్రభుత్వానికి, ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో వాదించారు. అదే బండారు ఇప్పుడు సోమవారం రాత్రి జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు  ప్రమాదానికి ప్రభుత్వమే కారణమంటూ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు