జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కరోనా పరీక్షలు

15 Jun, 2020 10:06 IST|Sakshi

సాక్షి, అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్న వీరికి  వైద్య సిబ్బంది స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్‌ జైలులో ఖైదీలకు ములాఖత్‌ నిలిపివేశారు. 

అయితే నేడు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అనంతపురం జిల్లా తాడిపత్రికి రానున్నారు. కాగా.. బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డి కడప సెంట్రల్‌ జైలులో ఉంట్నున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జేసీ బ్రదర్స్‌’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు

కడప జైలుకి జేసీ ప్రభాకర్‌రెడ్డి

మరిన్ని వార్తలు