లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్‌

27 May, 2020 10:54 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్‌ కూన రవికుమార్ పొందూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. తహసీల్దార్‌ను ఫోన్లో దుర్భాషలాడిన కూన రవికుమార్‌, మూడురోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్‌ చేస్తున్న వాహనాలను సీజ్‌ చేసినందుకు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్‌ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని కూన రవికుమార్‌ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్‌ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇది కూన రవికుమార్‌ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం..
మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్‌ చేశావ్‌. కానీ కంప్లైంట్‌ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్‌ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. 

నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్‌లో హెచ్చరిక  

ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీలకు ఇచ్చిన వార్నింగ్‌  

చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. 

మరిన్ని వార్తలు