తహశీల్దారు వార్నింగ్‌ ఇచ్చిన టీడీపీ నేత

24 May, 2020 22:02 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ నేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ మళ్లీ ఓ ప్రభుత్వ అధికారి మీద విరుచుకుపడ్డారు. పొందూరు తహశీల్దారు టి.రామకృష్ణను ఫోన్లో దుర్బాషలాడుతూ లంచం తీసుకోమని హెచ్చరించారు. ఈనెల 16న పొందూరు మండలం గోరింట చెరువు గర్భంలో మట్టిని తరలిస్తుండగా తహశీల్దారు అడ్డుకున్నారు. 4 లారీలను, ప్రొక్లైన్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుని లారీలను విడుదల చేయాలని కూన రవికుమార్‌ తహశీల్దారును బెదిరించారు. ఫోన్లో తీవ్రంగా దుర్బాషలాడారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా