టీడీపీ దాష్టీకాలను అడ్డుకుందాం

27 Nov, 2014 01:44 IST|Sakshi
టీడీపీ దాష్టీకాలను అడ్డుకుందాం

 యలమంచిలి (పాలకొల్లు అర్బన్) :తెలుగుదేశం పార్టీ నేతల వల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి వారిపక్షాన పోరాటం చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి యలమంచిలిలోని శ్రీఉమానరసింహ కల్యాణమండపంలో పార్టీ మండల కన్వీనర్ గుబ్బల వేణుగోపాలస్వామి (వేణు) అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
 
 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గస్థాయి, మండల స్థాయి సమావేశాలు ఇప్పటికే పూర్తిచేశానన్నారు. అవసరమైతే గ్రామస్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలందరికీ అండగా నిలబడతానన్నారు. తెలుగుదేశం నేతలు  చేస్తున్న దుర్మార్గాలు ప్రతిరోజు తన దృష్టికి వస్తున్నాయని, వాటినిృఆయా మండల స్థాయి అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. త్వరలోనే జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు నియామకం పూర్తిచేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే 12 అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించినట్టు చెప్పారు.
 
 5న జరిగే ధర్నా జయప్రదం చేయాలి
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ రైతులు, మహిళ పక్షాన జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 5న విశాఖలో తలపెట్టిన ధర్నాకి మద్దతుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాని జయప్రదం చేయాలని నాని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు ఇలపకుర్తి నరసింహరావు, బీడిళ్ల సంపతరావు, ఉచ్చుల స్టాలిన్, పొత్తూరి బుచ్చిరాజు, జక్కంశెట్టి బోసు, గొల్లపల్లి శ్రీనివాస్, పాలపర్తి ఇమ్మానియేలు తదితరులు మాట్లాడుతూ గ్రామ, బూత్‌స్థాయి కమిటీలను నియమించాలని కోరారు.
 
 ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మహిళల్ని అడ్డుపెట్టుకుని ఇసుక దందా చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర సాదరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టిం చిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. మండల కన్వీనర్ గుబ్బల వేణుగోపాలస్వామి (వేణు), ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జిల్లా యూ త్ అధ్యక్షుడు ముప్పిడి సంపత్, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, నడపన సత్యనారాయణ, పాలపర్తి ఇమ్మానియేలు, చేగొండి సూర్యశ్రీనివాస్, శిరిగినీడి రామకృష్ణ, మోకా నరసింహరావు, బోనం బులి వెంకన్న, పొత్తూరి బుచ్చిరాజు, వీరా ఉమాశంకర్, గుడాల సురేష్, కల్యాణం గంగాధరరావు, లంక చిరంజీవి పాల్గొన్నారు.
 
 ప్రజల పక్షాన పోరాటాలు చేద్దాం
 పాలకొల్లు : అసత్య, అబద్దపు వాగ్దానాలతో అందలమెక్కిన తెలుగుదేశంపార్టీ అసలు బండారం బయటపడేలా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తిగా గ్రామస్థాయిలో కూడా పార్టీ తరపున ప్రజలకు అండగా నిలుద్దామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణప్రసాద్ (నాని) పిలుపునిచ్చారు. బుధవారం పాలకొల్లు మండలం పూలపల్లిలోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసం వద్ద నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలివేయడంతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. పార్టీని విస్తృతస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి ఇప్పటికే జిల్లాస్థాయిలో పటిష్టమైన నాయకత్వంతో 12 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశామని, దీనికి మండల, గ్రామస్థాయికి విస్తరించాల్సి ఉందన్నారు. గ్రామాల్లో పార్టీకోసం కష్టించి పనిచేసేవారికే పదవులు అప్పగిస్తామన్నారు. గత ఎన్నిక సమయం నాటికి వైఎస్సార్ సీపీకి గ్రామస్థాయిలో పటిష్టమైన కమిటీలు లేకపోవడం వల్లనే చంద్రబాబు అబద్దపు ప్రచారాన్ని అడ్డుకోలేక ఓటమి చెందామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అసత్యవాగ్దానాలతో అందలమెక్కిన చంద్రబాబు వాటిని కప్పిపుచ్చుకోడానికి మరిన్ని అబద్దాలాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నారని దీనిని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తరపున అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
 
 నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ పార్టీ సభ్యత్వ నమోదులోను రాయితీల పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు. పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామ, మండలస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులతో కమిటీలు ఏర్పాటుచేయాలని కోరారు. కమిటీల నియామకంలో బంధుత్వాలు, మోహమాటాలకు తావులేకుండా పార్టీకోసం కష్టించి పనిచేసేవారిని గుర్తించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు చెల్లెం ఆనందప్రకాష్, ఘంటా ప్రసాదరావు, అస్లామ్, పాలకొల్లు మునిసిపల్ ప్రతిపక్షనేత యడ్ల తాతాజీ, నడపన సత్యనారాయణ, ఎం.మైఖేల్‌రాజు,  గుణ్ణం సర్వారావు, గవర బుజ్జి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు