ప్రైవేటు ట్రావెల్స్‌పై టీడీపీ నేతల పైరవీలు

8 Oct, 2018 10:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సాధారణ ప్రజలు ప్రయాణించే బస్సులపై కూడా టీడీపీ నేతలు పైరవీలు చేస్తున్నారు. నందిగామలో ఒకే పర్మిట్‌తో బస్సులను తిప్పేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. జిల్లాలోని అనాసాగరం వద్ద బస్సులోని ప్రయాణికులను దించి వేరే బస్సు మార్చేందుకు యాజమాన్యం ప్రయత్నించడంతో అసలు బండారం బయటపడింది. ఒకే పర్మిట్‌తో బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ గుట్టురట్టు కావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను నందిగామ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా బస్సులను విడిచిపెట్టాలని టీడీపీ నేతలు పోలీసుల వద్ద పైరవీలకు దిగారు. ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ ప్రయాణికులపై ఒత్తిడి తెస్తున్నారు. అక్రమాలను పాల్పడుతున్న ట్రావెల్స్‌ను ఎలా వెనుకేసుకొస్తారని.. వారి వైఖరిపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు