వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు

21 Dec, 2018 12:41 IST|Sakshi
బోడిపాటివారిపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

చిత్తూరు ,రొంపిచెర్ల: బోడిపాటివారిపల్లె, చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీల్లోని పలువురు టీడీపీ నాయకులు గురువారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వారికి పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు. రావిళ్లవారిపల్లెకు చెంది న వెంకటరమణనాయుడు, లక్ష్మయ్యనాయుడు, సిద్దయ్యనాయుడు, బాలకృష్ణమనాయుడు, పెద్దరెడ్డెప్ప, శ్రీనివాసులు, బోడిపాటివారిపల్లెకు చెందిన వెంకటరమణ, వెంకటేష్‌ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, శ్రేణులకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, విశ్వనాథరెడ్డి, పెద్దిరెడ్డి దేవేంద్రరెడ్డి, ప్రసాద్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కేవీపల్లె: జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.నౌజియాబేగంతో పాటు ఆమె అనుచరులు పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారు. గురువారం వగళ్లలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పర్యటించారు. ఆయన టీడీపీ నాయకులకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారి లో గుల్జార్, షాహీనా, దిల్షాద్, పర్వీన్, సబానా, జబ్బార్‌సాబ్, మస్తాన్, మహబూబ్‌ బాషా, సత్తార్, రహంతుల్లా, మరికొందరు ఉన్నారు. నౌజియాబేగం మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో జగన్‌ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని అందుకే పార్టీలో చేరామన్నారు. పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి, నాయకులు డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్, వెంకటసిద్ధులు, గజ్జెల శీన్‌రెడ్డి, కారపాకల భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకా లను చూసి రాష్ట్రంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి తెలిపారు. గురువారం ఆయన అరికెల పంచాయతీ నాగనపల్లెలో పర్యటించారు. టీడీపీకి చెందిన సుమారు 25 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలోకి చేరాయి. వారికి ఎమ్మెల్యే తిప్పారెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబుపై విరక్తి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారన్నారు. అందుకే వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నారన్నారు. మండల కన్వీనర్‌ భాస్కర్‌గౌడు, సింగిల్‌విండో చైర్మన్‌ కేశవరెడ్డి, మండల కో–ఆర్డినేటర్‌ శ్రావణ్, నాయకులు బుడ్డారెడ్డి, రత్నారెడ్డి, సుబ్బారెడ్డి, నంద తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోట: టీడీపీకి కంచుకోటగా నిలుస్తూ వచ్చిన నల్లగుట్టపల్లె మొత్తం గురువారం వైఎస్సార్‌సీపీలో చేరింది. ఈ గ్రామస్తులంతా టీడీపీలోనే కొనసాగుతూనే ఉన్నారు. ఇతర పార్టీలు గ్రామంలో ప్రచారం చేసేందుకు కూడా ఇష్టపడవు. అలాంటి గ్రామానికి ఇప్పటి వరకు అభివృద్ధిపరంగా ఎలాంటి ప్రయోజనం లేదన్న అసంతృప్తి ఉంది. దీంతో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. గురువారం టీడీపీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ వార్డు సభ్యులు నారాయణస్వామి, సీనియర్‌ నాయకులు సమావేశమయ్యారు. తంబళ్లపల్లె వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనా«థరెడ్డి సమక్షంలో వెంకటరమణ, ఈశ్వర, నాగరాజు, బాలకృష్ణారెడ్డి, ప్రసాద్, శంకర, గంగాధర్, వెంకటనారాయణ, రమణ, గోపాల్, ఆనంద్, వెంకటేష్‌ మరో 60 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి.

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు
పలమనేరు: కొలమాసనపల్లి పంచాయతీ అయ్యం రెడ్డిపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ వెంకటేగౌడ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన ‘రావాలి జగన్‌ కావాలి జగన్‌’ కార్యక్రమంలో వీరు పార్టీలో చేరారు. టీడీపీ పాలనలో విసిగిపోయామని రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవసరముందనే నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో చేరిన టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ సీనియర్‌నాయకులు గుండ్లపల్లి సుబ్రమణ్యం, నడిమికల్లా డు రామిరెడ్డి, అయ్యం రెడ్డిపల్లికి చెందిన కార్తీక్, రాంనాథ్, ధనుంజయ, రాఘవేంద్ర, రాజప్ప తది తరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసు, దయానంద్‌గౌడ, మండల కన్వీనర్‌ బాలాజీ నాయుడు, జిల్లా కార్యదర్శులు చెంగారెడ్డి, విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు