ఏసీసీ బాధితులను ఆదుకుంటాం

13 Jul, 2018 08:29 IST|Sakshi
రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి

మైలవరం : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోనికి రా గానే ఏసీసీ బాధితులను ఆదుకుంటామని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలా నరసింహా, వద్దిరాల రామాంజనేయుల యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీఎంపీ మాట్లాడుతూ 23 సంవత్సరాల నుంచి ఏసీసీ బాధితులు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. స్థానిక నాయకులు మోసపూరిత మాటలు నమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. 2016 నవంబర్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో మంత్రి ఆదినారాయణ రెడ్డి రైతులకిచ్చిన హామీ ఇంత వరకు నిలబెట్టుకోకపోవడం దురదృష్ణకరమన్నారు.వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ ఏసీసీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రజలు గళమెత్తితే వారిపై అక్రమ కేసులను ఆదినారాయణరెడ్డి పెట్టించారన్నారు.

తన అనుచరులపై ఎటువంటి కేసులు లేకుండా కేవలం  వైఎస్సార్‌సీపీ మద్దతు దారులపైనే పెట్టించారన్నారు. డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలంలో  ఏసీసీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాము అధికారంలోకి వచ్చి న వెంటనే తిరిగి  అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయంలో గొల్లపల్లె గ్రామానికి 110 ఇళ్లు మంజూరు చేశారని భూములు లేని నిరుపేదల కు 400 ఎకరాల భూపంపిణీ చేశారన్నారు.ప్రస్తుతం గ్రామంలో ఏడు ఇళ్లు మంజూరయ్యాయని, నాలుగేళ్లలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు టీడీపీ ప్రభుత్వం పంపిణి చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హనుమంతరెడ్డి, సిం గిల్‌విండో అధ్యక్షుడు శివగుర్విరెడ్డి, మాజీ సర్పంచ్‌శంకర్, గురుమూర్తి యాదవ్,యువజన నాయకుడు పోచిరెడ్డి, శివ, వెంకటరాముడు, శ్రీధర్‌రెడ్డి, వినయ్, బాబుల్‌రెడ్డి,నాగేంద్ర, చిన్నగైబు బాష,రామమోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిక...
గొల్లపల్లె గ్రామానికి చెందిన 45 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. లక్ష్మీనారాయణ సోమశేఖర్, శివకేశవులు సుబ్బనర్సయ్య, చిన్నరామయ్య జోసఫ్, మత్తయ్య, శ్రీనివాసులు,బాబు, చిన్నవెంకటసుబ్బయ్య, శ్రీరాములు సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వైఎస్‌ ఆవినాష్‌రెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌బాబు సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు