టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

23 Apr, 2018 08:07 IST|Sakshi
పార్టీలో చేరినవారితో వైఎస్సార్‌సీపీ  సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి 

పామిడి : జీ కొట్టాల గ్రామంలో 12 దళిత కుటుంబాలకు సంబంధించి 50 మంది వైఎస్సార్‌సీపీ నియో జకవర్గ సమన్వయకర్త వై వెంక టరామిరెడ్డి  సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కం డువాలతో వారిని వైవీఆర్‌  పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారి లో ఈశ్వరయ్య, హనుమంతు, ఓబులేసు, ఆదినారాయణ, ఉలింద, లక్ష్మీదేవి, రమాదేవి, రాధమ్మ, తదితర కుటుం బాలవారున్నారు.    ప్రజాసంకల్పయాత్ర  చేస్తూ నిరంతరం ప్రజలకో సం శ్రమిస్తూ , ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న  జగన్‌ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు చెప్పారు.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టన చంద్రబాబు
పీకి ప్రత్యేకహోదా విషయంలో పూటకో మాట, రోజుకో యూటర్న్‌లతో ఐదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని వైవీఆర్‌ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయలబ్ధి కోసం తిరిగి ప్రత్యేకహోదాను తెరపైకి తెచ్చి రంగులేని డ్రామాలతో దొంగదీక్ష, సైకిల్‌యాత్రతో ఐదుకోట్ల ఆంధ్రుల చెవుల్లో పూలు పెడుతున్న సీఎం బాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మొదటి నుం చి ప్రత్యేకహోదా కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూ విలువలతో కూడిన రాజకీయ పోరాటం చేస్తున్న జగన్‌కు రోజురోజుకూ  ప్రజాదరణ అధికమవుతోందన్నారు. ప్రత్యేకహోదా సాధన, రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నది జనం అభిమతమన్నారు.

బాధితులకు రూ.50 వేలు అందజేత
ఇటీవల దాడిలో గాయపడి మృతి చెందిన దళిత ప్రసాద్‌ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామిరెడ్డి ఆదివారం పరామర్శించారు.జీ కొట్టాల గ్రామంలోని బాధిత కుటుం బ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  కుటుంబ పోషణకు రూ.50 వేలను వారికి అందజేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు