వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక

30 Apr, 2018 10:28 IST|Sakshi
పార్టీలో చేరిన వారికి కండువాలు వేస్తున్న రెడ్డి శాంతి

పాతపట్నం : మండలంలోని సరాలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్‌ సీపీలో ఆదివారం చేరారు. పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ యజ్జల రాజారావు, అనప బాబురావు, వున్న కేశకరావు, లండ ఆనందరావు, జలమాన లక్ష్మణరావు, జన్నం ప్రసాదరావు, పి.చిట్టిబాబు, కె.నారాయణరావు, కె.మొఖలింగం, జె.నారాయణరావు, పోలాకి తిరుపతి, పండా సింహాచలం, పడాల భాస్కరరావు, కె.సింహాచలం, పప్పు భాస్కరరావు, ఎల్‌.లక్ష్మణరావు, జి.దండాసీ, పి.వెంకటరావు, మెళియపుట్టి మండలం వసందర గ్రామానికి చెందిన సలాన జనార్దనరావుతో పాటు పలువురు ఉన్నారు.

అధికార పార్టీ నాయకులు వారి అభివృద్ధి చూసుకుంటున్నారే తప్ప గ్రామాభివృద్ధి పట్టించుకోవడం లేదని వీరు వాపోయారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తురు మండల పార్టీ అధ్యక్షులు ఆర్‌.షణ్ముఖరావు, పాడి అప్పారావు, ఎస్‌.ప్రసాదరావు, అల్లు శకంరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి రెగేటి కన్నయ్య స్వామి, పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సెక్రటరీ కొండాల అర్జునుడు, రెడ్డి రాజు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు