టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో భారీ చేరికలు

16 Mar, 2019 15:14 IST|Sakshi
చీపురుగూడెంలో పార్టీలో చేరినవారితో ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు 

సాక్షి, చాట్రాయి(నూజివీడు):  ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మండలంలోని చీపురుగూడెం, నరసింహారావుపాలెం గ్రామాల్లో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెంది జగన్‌మోహనరెడ్డిపై ఉన్న నమ్మకంతో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో  కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో పార్టీ ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎద్దేవా చేశారు.

పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ టీడీపీ నాయకుడు ఓబిళ్లనేని వెంకటేశ్వరావుతో పాటు 20 టీడీపీ కుటుంబాల వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, జిల్లా వైఎస్సార్‌ సీపీ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు చెలికాని బాబ్జీ, మండల అధ్యక్షుడు మిద్దె బాలకృష్ణ, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చింతగుంట్ల వెంకటేశ్వరావు, చీపురుగూడెం ఎంపీటీసీ మేకల చందూ తదితరులు పాల్గొన్నారు. 


నరసింహారావుపాలెం: మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు సమక్షంలో గౌరసాని వెంకటరెడ్డితోపాటు 21 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్‌ పుచ్చకాయల లక్ష్మీకాంతమ్మ, మండల పార్టీ నాయకులు దామెర ప్రసాద్‌బాబు, వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ మండల కార్యదర్శి బి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు