టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి...

9 Sep, 2019 08:46 IST|Sakshi
పార్టీలో చేరిన టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు 

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజారంజక పాలనతో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.  ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో పట్టణంలోని 31వ వార్డుకు చెందిన  తెలుగుదేశం పార్టీ నేతలు వింత ప్రభారరరెడ్డి, వింత సందీప్, యార్లగడ్డ భవాని, యార్లగడ్డ సుబ్బారావుల ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆదివారం చేరారు. వీరికి ఎమ్మెల్యే కోలగట్ల, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ దివంగత యార్లగడ్డ రంగారావు కుటుంబ సభ్యులు, వారి అనుచరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న ప్రజారంజక పాలన, నియోజకవర్గంలో తన నాయకత్వాన్ని, మంత్రి బొత్స నాయకత్వాన్ని నచ్చి మెచ్చి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు.

వీరి రాకతో నియోజకవర్గంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడిందన్నారు. విజయనగరం పట్టణంలో ఇప్పటికే 18 వార్డుల్లో క్షేత్ర స్థాయి  పర్యటనలు పూర్తి చేశామని, మిగతా వార్డుల్లో కూడా త్వరితగతిన పర్యటించి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.  జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ,  కలెక్టర్, తాను విజయనగరం పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వింత ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజారంజక పాలన చూసి పార్టీలో చేరామన్నారు.  వీరితో పాటు టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలు జి.చంద్రరావు, జి.కృష్ణ, ఎన్‌.రమణ, ఆర్‌.ఎస్‌.కె. రాజు, రాజేష్‌ రాజు, శ్రవంత్‌ వర్మ, శేఖర్, పైడి రాజు, జి.గౌరీ, ప్రమీల, రమ, ఆదినారాయణతో పాటు 150మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, 31వ వార్డు ఇన్‌చార్జి  తోట రాజశేఖర్, పార్టీ నాయకులు గంగ, పిన్నింటి రామలక్ష్మి, సాగర్, జాతవేద, వర్మ  ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా