టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి.. 

23 Dec, 2019 10:21 IST|Sakshi
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యేలు రాజన్నదొర, అప్పల నరసయ్య

200 కుటుంబాలు చేరిక 

మెంటాడ: మెంటాడ మండలంలో వైఎస్సార్‌ సీపీకి మరింత ఆదరణ లభిస్తోంది. మండలంలోని చల్లపేటలో మాజీ సర్పంచ్‌లు జి.భాగ్యలక్ష్మి, తాడ్డి అరుణ, మాజీ ఎంపీటీసీ జి.సత్యశ్రీనివాసరావు, మెంటాడ పీఏసీఎస్‌ అధ్యక్షుడు తాడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ చప్ప సూర్య కుమారి, తాడ్డి తనూష, విశ్రాంత ఉపాధ్యాయులు చప్ప సూర్యం, తాడ్డి గోవిందరావు, మిత్తిరెడ్డి గోపాలం తో పాటు సుమారు 200 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యలు పార్టీ కండువాలు కప్పి వారిని సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు.

జేకే నిధులు మంజూరయ్యాయని ఆండ్ర హైలెవెల్‌ కెనాల్‌ పూర్తి చేసి ఏన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 17 గ్రామాల రైతులకు చెందిన 4100 ఎకరాలకు అదనపు సాగునీరు అందిస్తామని రైతులు అడిగిన ప్రశ్నకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ రెడ్డి సన్యాసినాయుడు, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వడ్డి చిన్నారావు, సాలూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సిరిపురపు నాగమణి, సాలూరు నియోజకవర్గం నాయకులు దండి శ్రీను, సువ్వాడ రమణ, హేమంత్, మాజీ ఎంపీపీలు శొంఠ్యాణ సింహాచలం, కొర్రాయి కళావతి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పొరిపిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు