నిజాలన్నీ గోదాంలో ఆహుతి 

5 May, 2019 10:46 IST|Sakshi
గోదాంలో అగ్ని ప్రమాద ఘటనను పరిశీలిస్తున్న నిర్వాహకుడు సంజీవరెడ్డి, ఇన్సూరెన్స్‌ అధికారులు (ఫైల్‌)

రూ.4లక్షలు ఇవ్వలేదని రూ.12.5కోట్లు విలువైన ఆస్థిని తగలబెట్టారట’’...ఇది నమ్మదగినదేనా.. పులివెందుల పోలీసులు అక్షరాల ఇదే నిజమంటున్నారు. లింగాల మండలంలో డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌ హౌస్‌లో గతనెలలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఇదే కారణమట. మూడు వారాలు పాటు శోధించి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా పోలీసులు తేల్చిన దర్యాప్తు సారాంశమిది. 

సాక్షి ప్రతినిధి కడప:  డీఎస్‌ఆర్‌ గోదాం యజమాని.. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి సంజీవరెడ్డి చేతికి మంటి అంటకుండా విచారణ ముగించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. పులివెందుల సీఐ రామకృష్ణుడు కథనం ప్రకారం సంజీవరెడ్డిపై కోపంతో గోదాంలో చింతకాయల నాగరాజు(అంబకపల్లె) నిప్పు పెట్టాడట. తాడిపత్రిలో మూడు క్యాన్లు కొని కొండాపురం, సింహాద్రిపురం గ్రామాల్లో  34లీటర్ల వంతున అందులో పెట్రోల్‌ నింపి బొలెరో వాహనంలో తీసుకువచ్చాడట.

వాటిని కంపచెట్లలో దాచిపెట్టి తర్వాత ప్లాస్టిక్‌ కవర్లలో పెట్రోల్‌ నింపి బావమరిది సహకారంతో గోదాంలో సరుకు తగలబెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రైతులు నమ్మినా నమ్మకపోయినా విచారణలోరూ.4లక్షలు ఇవ్వలేదని రూ.12.5కోట్లు విలువైన ఆస్థిని తగలబెట్టారట’’...ఇది నమ్మదగినదేనా.. పులివెందుల పోలీసులు అక్షరాల ఇదే నిజమంటున్నారు. లింగాల మండలంలో డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌ హౌస్‌లో గతనెలలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఇదే కారణమట. మూడు వారాలు పాటు శోధించి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా పోలీసులు తేల్చిన దర్యాప్తు సారాంశమిది. 

సాక్షి ప్రతినిధి కడప:  డీఎస్‌ఆర్‌ గోదాం యజమాని.. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి సంజీవరెడ్డి చేతికి మంటి అంటకుండా విచారణ ముగించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. పులివెందుల సీఐ రామకృష్ణుడు కథనం ప్రకారం సంజీవరెడ్డిపై కోపంతో గోదాంలో చింతకాయల నాగరాజు(అంబకపల్లె) నిప్పు పెట్టాడట. తాడిపత్రిలో మూడు క్యాన్లు కొని కొండాపురం, సింహాద్రిపురం గ్రామాల్లో  34లీటర్ల వంతున అందులో పెట్రోల్‌ నింపి బొలెరో వాహనంలో తీసుకువచ్చాడట. వాటిని కంపచెట్లలో దాచిపెట్టి తర్వాత ప్లాస్టిక్‌ కవర్లలో పెట్రోల్‌ నింపి బావమరిది సహకారంతో గోదాంలో సరుకు తగలబెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రైతులు నమ్మినా నమ్మకపోయినా విచారణలో అదే విషయాన్ని  సీఐ స్పష్టంచేశారు.  టీడీపీ నేతలు అనుకున్న రీతిలోనే ఈ కేసును ముగింపు పలికారు. పోలీసులుసంపూర్ణ సహకారాలు అందించి  అధికార పార్టీకి అండగా నిలిచారని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.

అసలు నిందితులను తప్పించి....
అసలు నిందితులను కేసు నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి ముందుగానే తమ సరుకును పక్కదారి పట్టించి నిర్వాహకులు సొమ్ము చేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పూర్తి స్టాకు లేని విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. గోదాంలోని సరుకుపై ఆంధ్రాబ్యాంక్‌లో రూ.9కోట్లు, కెనరాబ్యాంక్‌లో రూ.8కోట్లు బంధువుల పేరిట నిర్వాహకులు అక్రమంగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌లకు ఎగనామం పెట్టి, లేనిస్టాకు కాలిపోయినట్లుగా చూపెట్టి బీమా కోసం ఎత్తుగడ వేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

అందువల్లే రూ.20కోట్లకు నిర్వాహకులు బీమా చేశారు. ఇలాంటి విషయాలపై  పోలీసులు దృష్టి సారించలేదు. టీడీపీ దర్శకత్వంలో కేసు విచారించి నిందితులకు అండగా నిలిచారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. 16షెట్టర్లు బయట నుంచి తొలగించి ఆనవాలే కనిపించలేదు. విద్యుత్‌ షార్ట్‌కు సంబంధించిన ఆధారాలూ లేవు. అయినా నిర్వాహకులతో కలిసి పోలీసు యంత్రాంగం హైడ్రామా నడిపింది. నిర్వాహకులనుగానీ, సిబ్బందిని గానీ స్టేషన్‌కు పిలిపించిన దాఖలాలు లేవు. గట్టిగా విచారించిన సందర్భమూ లేదు. దీన్ని బట్టే  గోదాం నిర్వాహకునితో పోలీసులు కుమ్మక్కయ్యారని రూఢీ అవుతోంది.

నిందితుడిగా చూపిన నాగరాజు గోదాం నిర్వాహకుడు సంజీవరెడ్డికి అత్యంత సన్నిహితుడు. గడిచిన ఎన్నికల్లో సంజీవరెడ్డి అనుచరుడుగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాడు. టీడీపీ తరపున ఫ్యాక్షన్‌ గ్రామమైనా పోలింగ్‌ ఏజెంటుగా కూర్చున్నారు. ఏజెంటుగా కూర్చుంటే రూ.4లక్షలు సంజీవరెడ్డి ఇస్తానని చెప్పి, తర్వాత ఇవ్వకపోగా ఇష్టానుసారం మాట్లాడారనే కోపంతో గోదాం తగలబెట్టామని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులంటున్నారు. స్వల్ప మొత్తం కోసం కోట్ల రూపాయల విలువైన ఆస్థిని తలగబెట్టడంపై పోలీసులకు కనీస అనుమానం రాకపోవడం విశేషం. సమస్యల్లో ఉన్నందున ఇలా చేశాడని విచారణను సమర్ధించుకుంటున్నారు. పెద్ద ఎత్తున మొత్తం చేతులు మారడంతో నాగరాజు కేసులో అడ్మిట్‌ అయినట్లుగా పులివెందులలో జోరుగా ప్రచారం అవుతోంది.  తమపై తప్పు లేకుండా  విచారణకు రావాలంటూ పోలీసులు 41సీఆర్‌పీసీ జారీ చేసినట్లు, ఆమేరకు విచారణకు హాజరుకాకపోవడం, ఆపై తామే తగలబెట్టామని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కథ అల్లారని భోగట్టా.

ఘటనపై టీడీపీ నేతలు సఫలం....
సంఘటన జరిగిన వెంటనే తమ పార్టీకి చెందిన సంజీవరెడ్డిని కేసు నుంచి కాపాడేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్సీ, ఇతర టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును చాకచక్యంగా పక్కకు మళ్లించారు. ఈ క్రమంలో భారీ నగదు చేతులు మారినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా విచారణ ఉంటుందని ఆశించిన రైతులకు భంగపాటు మిగిలింది. ఇదే విషయమై ఎస్పీఅభిషేక్‌ మహంతితో మాట్లాడగా తన విచారణలో కేసును తప్పుదారి పట్టించారని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. కాగా శనివారం నాగరాజుతోపాటు అతని బామర్ది గంగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు లింగాల ఎస్‌ఐ అమరన్నాథరెడ్డి మీడియాకు తెలిపారు. 

మరిన్ని వార్తలు