‘టీడీపీ నేతలు అనుమతి అడగలేదు’

11 Sep, 2019 12:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: పల్నాడులో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేలా ఎవరు ప్రవర్తించినా సహించబోమని గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్‌. జయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతి అడిగినా, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. టీడీపీ నాయకులు అసలు ఎలాంటి అనుమతి అడగలేదని, కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎవరిపైనైనా కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో ఉన్న తమ వారికి భోజనాలు రానివ్వటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అక్కడ ఉన్న వారంతా భోజనాలు చేశారని ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారని ఎస్పీ జయలక్ష్మి చెప్పారు.       

బాబు ఇంటి వద్ద జర్నలిస్టులు ధర్నా
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు జర్నలిస్టులు ధర్నాకు దిగారు. తమకు అనుకూలంగా ఉన్న వారినే చంద్రబాబు తన ఇంట్లోకి పిలిపించుకున్నారని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల పట్ల వివక్ష  విడనాలంటూ గేట్ ఎదుట రోడ్డుపై పాత్రికేయులు బైఠాయించారు. మీడియా పట్ల పక్షపాత వైఖరి సరికాదని అన్నారు. మీడియాను అడ్డుకోవటంలో తమ ప్రమేయం ఏమీ లేదని, టీడీ జనార్దన్ చెప్పిన ఛానల్స్ ప్రతినిధులనే చంద్రబాబు ఇంటిలోకి అనుమతించినట్టు పోలీసులు తెలిపారు. టీడీ జనార్దన్ అనుమతి తీసుకొంటే మిమ్మల్నీ లోనికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడం గమనార్హం. (చదవండి: రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు)

మరిన్ని వార్తలు