జేసీ అక్రమాలపై టీడీపీ నేతలు స్పందించాలి

27 Nov, 2019 22:14 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కందిగోపుల మురళి డిమాండ్‌ చేశారు. త్రిసూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించి మురళి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జేసీ అక్రమాలపై 2011లోనే హైకోర్టులో కేసు వేశానని అన్నారు. త్రిసూల్‌ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులకు సంబంధించి ఎందుకు రద్దు చేయకూడదని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. నోటీసులు సైతం జారీ చేసిందని అన్నారు. తన పని మనుషుల పేరుతో త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు పొందిన ఘనుడు జేసీ అని విమర్శించారు.

జేసీ ఆధీనంలో ఉన్న 1600 ఎకరాల త్రిసూల్ ఫ్యాక్టరీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రూ. 500 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి మోసం చేసిన జేసీ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ అక్రమాలపై టీడీపీ నేతలు కూడా స్పందించాలన్నారు. కాగా, త్రిసూల్‌ సిమెంట్‌ వ్యవహారంలో జేసీకి నేడు  హై​కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. 

చదవండి : జేసీ దివాకర్ రెడ్డి ‍కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టు నోటీసులు

మరిన్ని వార్తలు