టీడీపీ.. చీకటి వ్యాపారం

8 Dec, 2019 08:43 IST|Sakshi
టీవీఎస్‌ కాంతారావ్‌ క్రషర్‌ వద్ద జేసీబీతో కంకర డస్ట్‌ను లోడ్‌ చేస్తున్న దృశ్యం  

రాత్రివేళ.. కర్ణాటకకు రయ్‌! 

మూతపడిన క్రషర్ల నుంచి అక్రమంగా కంకర తరలింపు 

మంత్రి కాలవ శ్రీనివాసులు అండతో చెలరేగుతున్న టీడీపీ నేత కాంతారావ్‌ 

సాక్షి, బొమ్మనహాళ్‌: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అండతో టీడీపీ నాయకుడు టీవీఎస్‌ కాంతారావ్‌ నేమకల్లు సమీపాన కొండల్లో ఉన్న కంకర మిషన్ల నుంచి కంకరను, డస్ట్‌ పౌడర్‌ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అదీ రాత్రి వేళ కర్ణాటకకు తరలిస్తున్నారు. గత ఏడాది నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల రైతులు కంకర మిషన్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు నాశనం అవుతున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మేకలు, గొర్రెలు, జీవాలు, ప్రజలు కంకర మిషన్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల చనిపోతున్నాయని, తక్షణమే కంకర మిషన్లను నిలిపివేయాలని గ్రీన్‌ టిబ్యునల్‌కు వెళ్లారు. ఈ విషయంపై గ్రీన్‌ టిబ్యునల్‌ అధికారులు పరిశీలించి నేమకల్లు కొండల్లో కంకర మిషన్లను, క్వారీలను పూర్తిగా నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.  

ఉత్తర్వులు బేఖాతర్‌ 
గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను టీడీపీ నాయకుడు టీవీఎస్‌ కాంతారావ్‌ బేఖాతర్‌ చేశారు. తన స్వంత కంకర మిషన్‌ను తెరిచి నిల్వ ఉంచిన కంకరను, డస్టŠట్‌ పౌడర్‌ను లారీల్లో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం కాంతారావ్‌ కంకర మిషన్‌ నుంచి కర్ణాటకకు కంకరను అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లతో పాటు జేసీబీని నేమకల్లు గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఒక్క రోజే దాదాపు 25 లారీల కంకర, డస్ట్‌ను కర్ణాటకకు తరలిచినట్లు గ్రామస్తులు తెలిపారు.  అధికారులు స్పందించి  అక్రమంగా తరలిపోతున్న కంకరకు అడ్డుకట్ట వేసి, కాంతారావ్‌పై చట్టపరమైన తీసుకోవాలని  తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు